2025 జూలై 06th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 6th 2025

మేష రాశి (Aries)

కెరీర్: రోజంతా బిజీగా ఉంటారు. పని చేసే ప్రదేశంలో అనుకోని పని ఒత్తిడి ఉంటుందివ్యాపారం:  ఎక్కువ మార్గాల ద్వారా ధనం పొందే అవకాశం ఉంది.ధనం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కానీ అనవసరమైన ఆందోళనలు వీడండివిద్య: విద్యార్థులకు ఇతర విషయాలపై దృష్టి మరలుతుందిప్రేమ/కుటుంబం: కోపంతో ఎవరితోనూ వాదించవద్దు పరిహారం: సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి,  ఇంట్లో ఆవు నేతితో  దీపం వెలిగించండి.లక్కీ కలర్: మెరూన్లక్కీ నంబర్: 6

వృషభ రాశి (Taurus)

కెరీర్: మీరు కొత్త ప్రాజెక్ట్‌పై పని చేయడం ప్రారంభిస్తారు, సీనియర్‌ల సహకారం లభిస్తుంది.వ్యాపారం: ఏదైనా కొత్త భాగస్వామ్య ఆలోచన సఫలం అవుతుందిధనం: రోజు లాభదాయకంగా ఉంటుంది, కానీ ఆలోచించి ఖర్చు చేయండి.విద్య: ఆసక్తికి సంబంధించిన కొత్త సబ్జెక్ట్‌లో చదువుకోవడం ప్రారంభిస్తారుప్రేమ/కుటుంబం: ప్రేమ సంబంధాలలో కొత్తదనం ఉంటుందిపరిహారం: శ్రీకృష్ణుడిని పూజించండిలక్కీ కలర్: గులాబీలక్కీ నంబర్: 2

మిథున రాశి (Gemini)

కెరీర్:  ఉద్యోగులకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుందివ్యాపారం: ఆస్తి వివాదంలో విజయం మిమ్మల్ని వరిస్తుందిధనం: ఆదాయం పెరుగుతుంది..ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారువిద్య: చదువులో సానుకూల శక్తి ఉంటుంది.ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి, ఒత్తిడి తగ్గుతుంది.పరిహారం: తులసి మొక్కకు నీరుపోయండిలక్కీ కలర్: ఆకాశంలక్కీ నంబర్: 3

కర్కాటక రాశి (Cancer)

కెరీర్: కార్యాలయంలో కొన్ని కొత్త పథకాలు ప్రారంభించవచ్చు.వ్యాపారం: అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.ధనం: ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు తగ్గించండివిద్య: మీరు ఆత్మవిశ్వాసంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారుపరిహారం: శివునికి బిల్వపత్రాలను సమర్పించండి.లక్కీ కలర్: తెలుపులక్కీ నంబర్: 4

సింహ రాశి (Leo)

కెరీర్: కెరీర్‌లో పదోన్నతి గురించి సమాచారం పొందవచ్చు.వ్యాపారం: విదేశీ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు.ధనం: అకస్మాత్తుగా ధన లాభం ఉంటుంది.విద్య: విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు, మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది.ప్రేమ/కుటుంబం: తోబుట్టువుల నుంచి సహకారం లభిస్తుంది, కుటుంబంతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంది.పరిహారం:   "ఓం సూర్యాయ నమః" జపించండి.లక్కీ కలర్: పసుపులక్కీ నంబర్: 1

కన్యా రాశి (Virgo)

కెరీర్: పని చేసే ప్రదేశంలో శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.వ్యాపారం: పెట్టుబడుల నుంచి లాభం ఉంటుంది కానీ తొందరపడకుండా ఉండండి.ధనం: కొన్ని అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు.విద్య: విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహిస్తారుప్రేమ/కుటుంబం: పిల్లలకు చేసిన వాగ్దానాన్ని కచ్చితంగా నెరవేర్చండి.పరిహారం: హనుమంతునికి సింధూరం సమర్పించండి.లక్కీ కలర్: బ్రౌన్లక్కీ నంబర్: 8

తుల రాశి (Libra)

కెరీర్: కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది, పదోన్నతి  ఉంది.వ్యాపారం: మీ ఇమేజ్ సానుకూలంగా ఉంటుంది, కొత్త క్లయింట్‌లు చేరవచ్చు.ధనం: ఆదాయ మార్గాలు పెరుగుతాయి.విద్య: చదువుపై ఆసక్తి ఉంటుంది, ఏదైనా పోటీ పరీక్షలో విజయం సాధిస్తారుప్రేమ/కుటుంబం: ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. పరిహారం: ఏదైనా ఆలయంలో సుగంధ ద్రవ్యాలు, పువ్వులు సమర్పించండి.లక్కీ కలర్: నీలంలక్కీ నంబర్: 9

వృశ్చిక రాశి (Scorpio)

కెరీర్: పనుల్లో మెరుగుదల ఉంటుంది..ఆశించిన విజయం పొందుతారువ్యాపారం: కొత్త పనిని ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది.ధనం: ఖర్చులు , పెట్టుబడులలో సమతుల్యతను పాటించండి.విద్య: చదువుని నిర్లక్ష్యం చేయవద్దుప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో చిన్న విషయాలపై వాదనలు ఉండవచ్చు.పరిహారం: ఆంజనేయుడి ఆలయానికి వెళ్లిరండిలక్కీ కలర్: నారింజలక్కీ నంబర్: 6

ధనుస్సు రాశి (Sagittarius)

కెరీర్: పనిలో మెరుగుదల ఉంటుంది, పాత పనులను పూర్తి చేస్తారు.వ్యాపారం: వ్యాపారంలో లాభం ఉంటుంది.ధనం: ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కానీ ఆదాయం పెరుగుతుందివిద్య: చదువుపై దృష్టి పెడతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.ప్రేమ/కుటుంబం: కుటుంబ సంబంధాలు మధురంగా ఉంటాయి పరిహారం: శ్రీరామచరిత మానస్‌  పఠించండి.లక్కీ కలర్: గోల్డెన్లక్కీ నంబర్: 7

మకర రాశి (Capricorn)

కెరీర్: కార్యాలయంలో గౌరవం లభిస్తుంది.వ్యాపారం: వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి.ధనం: ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.విద్య: పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారుప్రేమ/కుటుంబం: అబద్ధపు వాగ్దానాలకు దూరంగా ఉండండి, లేకపోతే సంబంధాలు దెబ్బతింటాయి.పరిహారం: శని దేవునికి ఆవాల నూనెను సమర్పించండి.లక్కీ కలర్: బూడిదలక్కీ నంబర్: 10

కుంభ రాశి (Aquarius)

కెరీర్: ఇంటర్వ్యూ లేదా కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వినవచ్చు.వ్యాపారం: భూమి , ఆస్తి నుంచి లాభం ఉంటుంది.ధనం: నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది, పెట్టుబడుల నుంచి కూడా లాభం ఉంటుంది.విద్య: విద్యార్థులకు  ఏకాగ్రత పెరుగుతుంది.ప్రేమ/కుటుంబం: ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందిపరిహారం: శని ఆలయంలో నీలిరంగు పువ్వులు సమర్పించండి.లక్కీ కలర్: నీలంలక్కీ నంబర్: 13

మీన రాశి (Pisces)

కెరీర్: పని చేసే ప్రదేశంలో వివాదాలకు అవకాశం ఇవ్వొద్దువ్యాపారం: వ్యాపారంపై పూర్తి స్థాయిలో శ్రద్ధవహిస్తేనే లాభం వస్తుందిధనం: పెట్టుబడుల నుండి లాభం ఉంటుంది.. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.విద్య: విద్యార్థులు ఎక్కువ కష్టపడితే సాధారణ ఫలితాలు పొందుతారుప్రేమ/కుటుంబం: పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారుపరిహారం: ఆలయంలో ప్రసాదం పంచిపెట్టండిలక్కీ కలర్: క్రీమ్లక్కీ నంబర్: 11

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.