2025 ఆగష్టు 1st రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu August 1st 2025
మేష రాశి
ఈ రోజు మేష రాశి వారికి అద్భుతమైన ప్రారంభాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా అసంపూర్తిగా ఉన్న పని పూర్తవుతుంది. వ్యాపారంలో పెద్ద ఆర్డర్ లభించే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో భాగస్వామితో భావోద్వేగ బంధం బలపడుతుంది. కుటుంబ జీవితంలో సామరస్యం ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ జీర్ణ సమస్యలను నివారించడానికి తేలికపాటి ఆహారం తీసుకోండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు కొన్ని మిశ్రమ ఫలితాలను తెస్తుంది. ఖర్చులను నియంత్రించడం అవసరం, లేకపోతే ఆర్థిక సమతుల్యత దెబ్బతింటుంది. జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో వాగ్వాదం జరగవచ్చు, కానీ సాయంత్రానికి సమస్య పరిష్కారమవుతుంది. కార్యాలయంలో కష్టపడి పనిచేయడం ఫలిస్తుంది మరియు సీనియర్ల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణ యోగం ఉంటుంది.
మిథున రాశి
ఈ రోజు కొంచెం అస్థిరంగా ఉంటుంది. కార్యాలయంలో అపార్థాలను నివారించండి. జట్టుతో సమన్వయం ఉంచుకోండి. ప్రేమ జీవితంలో భావోద్వేగ హెచ్చు తగ్గులు సాధ్యమే. పెట్టుబడి విషయాల్లో తొందరపాటు వద్దు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ధ్యానం యోగాతో మానసిక శాంతి లభిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు అదృష్టం ఆమడ దూరం ఉంటుంది కానీ కష్టపడి పనిచేయడం ద్వారా పరిస్థితులు మీకు అనుకూలంగా మారవచ్చు. సంతానం గురించి ఆందోళన ఉంటుంది. ప్రేమ జీవితంలో కొన్ని చికాకులుంటాయి. నిజాయితీగా మాట్లాడటం మీకు మంచి జరుగుతుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం కొంచెం ఆందోళన కలిగిస్తుంది. సహనం , ఓర్పుతో ఉండండి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు ప్రకాశవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. ప్రేమ జీవితంలో భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితంలో సమతుల్యత ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆఫీసులో పెద్ద బాధ్యతను అప్పగించవచ్చు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు కొంత కష్టతరంగా ఉండవచ్చు. పనిలో లక్ష్యాలను పూర్తి చేయడానికి ఒత్తిడి ఉంటుంది. మానసిక అలసట ఉండవచ్చు. జీవిత భాగస్వామి మద్దతు ఉపశమనం కలిగిస్తుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు శక్తితో నిండి ఉంటుంది. పాత వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో శృంగార సమయం గడిపే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమం గురించి చర్చలు జరగవచ్చు. ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ధన లాభం, వ్యాపార విజయాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా ప్రశంసలు లభించవచ్చు. ప్రేమ జీవితంలో లోతైన అనుబంధం పెరుగుతుంది. ఇంట్లో అతిథుల రాక ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు . రక్తపోటు మరియు గుండె సంబంధిత సమస్యలను సులువుగా తీసుకోవద్దు.
ధనుస్సు రాశి
ఈ రోజు చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రేమ భాగస్వామితో దూరం తగ్గుతుంది , పరస్పర అవగాహన పెరుగుతుంది. విద్యార్థులకు సమయం చాలా బాగుంటుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి . మీ పనిపై దృష్టి పెట్టండి. ప్రయాణం వాయిదా వేయడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మధ్యస్థంగా ఉంటుంది. ధనం వచ్చే అవకాశం ఉంది, ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. మానసిక శాంతి కోసం ధ్యానం యోగా చేయండి. ఆఫీసులో పని ఒత్తిడి ఉంటుంది కానీ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సంతానం నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు వృత్తిపరమైన వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఖరారవుతాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో పాత స్నేహితుడితో సమావేశం అవుతారు.. ఇది సంబంధానికి కొత్త మలుపు తిప్పవచ్చు. ఇంట్లో పెద్దలతో సమయం గడపండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. కార్యాలయంలో చేపట్టిన ప్రాజెక్ట్ పూర్తవుతుంది, ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి ఉంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు ప్రశ్న 1. ఈ రోజు ప్రేమ జీవితంలో ఏ రాశుల వారికి విజయం లభిస్తుంది?మేషం, తుల , సింహ రాశి వారికి ప్రేమ జీవితంలో ఆనందం సానుకూల ఫలితాలు లభిస్తాయి.
ప్రశ్న 2. ఏ రాశుల వారు ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది?వృషభం, కన్య , మకర రాశి వారు రేపు డబ్బు నిర్వహణలో జాగ్రత్త వహించాలి.
ప్రశ్న 3. ఈ రోజు ప్రయాణం చేయవచ్చా?ధనుస్సు, మిథున రాశి వారికి ప్రయాణం వాయిదా వేయడం మంచిది. కుంభం , తులా రాశి వారికి ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది.
ప్రశ్న 4. ఉద్యోగస్తులకు ఏ రాశి వారికి ఈ రోజు బాగుంటుంది?వృశ్చికం, కుంభం , సింహ రాశి వారికి ఆఫీసులో మంచి పనితీరు మరియు ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి.
ప్రశ్న 5. ఆరోగ్యం పరంగా ఏ రాశుల వారు జాగ్రత్త వహించాలి?కర్కాటకం, కన్య, వృశ్చిక రాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.