Prediction 2026:  ఆగస్టు 14, 1947 రాత్రి పాకిస్తాన్ (Pakistan) ఏర్పడింది. అదే క్షణంలో దాని జాతకంలో వినాశనం విత్తనాలు ఏర్పడ్డాయి. మేషం లగ్నానికి సంబంధించిన  ఈ జాతకం యుద్ధ ప్రియుడైన కుజుడిని ఎంకరేజ్ చేస్తుంది. ఇది నీచ స్థానంలో శుక్రుడితో కలసి ఉంది. దీని అర్థం ఏంటంటే, ఈ దేశం మొదట సైన్యం, పోరాటం  అప్పుల ఆధారంగా జీవిస్తుంది. చంద్రుడు వృషభంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, రాహువు నీడ దీనిని   హింసాత్మకంగా, అస్థిరంగా చేస్తుంది. కర్కాటక రాశిలో సూర్యుడు  - శని కలయిక ప్రజాస్వామ్యానికి శాపంలా మారింది... పదేపదే తిరుగుబాట్లు, అధికార సంక్షోభం , ప్రజల ఆగ్రహం తప్పదు

Continues below advertisement


ఇప్పుడు, ఇదే జాతకం 2026లోనూ కనిపిస్తంది.  ఏదో పెద్ద సంఘటన జరగబోతోందని సూచిస్తోంది. సంవత్సరం ప్రారంభంలో, పాకిస్తాన్ చంద్ర-శని దశ   చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ప్రజలు -  ప్రభుత్వం ఒకరినొకరు ఎదుర్కొంటారు. పార్లమెంట్ కూలిపోతుంది, వీధుల్లో రక్తం పారుతుంది .. ప్రధానమంత్రి కుర్చీ ప్రతిరోజూ కదులుతుంది. 


మార్చి 7, 2026 నుంచి ఏప్రిల్ 13, 2026 వరకు శని అస్తమించడం (Shani Asta 2026) ప్రభుత్వం బలహీనపరుస్తుంది. పరిస్థితులు ఎంతగా దిగజారుతాయంటే  ప్రజాస్వామ్యం కేవలం ఒక పేరుగా మిగిలిపోతుంది.  ఆర్థిక పరిస్థితులు ఈ మంటలను మరింత పెంచుతాయి.


పాకిస్తాన్ జాతకంలో శుక్రుడు నీచంగా ఉన్నాడుఇదే పేదరికానికి మూలం. జూన్ 2, 2026న గురువు కర్కాటక రాశిలో (Guru Gochar 2026) ప్రవేశిస్తాడు, కొన్ని రోజులపాటు IMF మరియు అరబ్ దేశాల నుంచి సహాయం లభించవచ్చు. కానీ ఈ ఉపశమనం ఒక భ్రమ.


అక్టోబర్ 31, 2026న గురువు సింహంలోకి ప్రవేశిస్తాడు ... ప్రజల ఇళ్లలో అసంతృప్తి అగ్నిపర్వతంలా పేలిపోతుంది. డిసెంబర్ 13, 2026 నుంచి గురువు తిరోగమనంలోకి ప్రవేశించి నిర్ణయాలను తిరగకొడతాడు ... విధానాలు గందరగోళంగా మారతాయి. ఫలితంగా... డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి పడిపోతుంది, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది .. ప్రజలు ఆహారం కోసం వీధుల్లో కొట్టుకునే పరిస్థితులు వస్తాయి.  


అక్టోబర్-డిసెంబర్ 2026లో అత్యంత భయంకరమైన పేలుడు సంభవిస్తుంది. రాహు-కేతువుల సంవత్సరం పొడవునా ప్రభుత్వాన్ని కదిలిస్తుంది.. నవంబర్ 25న రాహువు మకరం.. కేతువు కర్కాటకంలోకి ప్రవేశించగానే ఈ మంటలు చెలరేగుతాయి.


పార్లమెంటులో విధ్వంసం, మంత్రివర్గంలో నమ్మకద్రోహం .. ప్రధానమంత్రి కుర్చీ కదిలే పరిస్థితి ఎదురవుతుంది. సింహంలో కేతువు నాయకత్వాన్ని బలహీనపరుస్తాడు ...ప్రజలు హింస వైపు పరుగెత్తుతారు. పాకిస్తాన్ బహిరంగ తిరుగుబాటును ఎదుర్కొనే సమయం ఇది.


కుజుడి కదలిక వీటన్నింటికీ ఆజ్యం పోస్తుంది. ఆగస్టు 2, 2026న కుజుడు మిథునంలోకి ప్రవేశించగానే సరిహద్దు దాటి గూఢచర్య కార్యకలాపాలు  ఉగ్రవాద దాడులు పెరుగుతాయి. సెప్టెంబర్ 18న కుజుడు కర్కాటకంలోకి ప్రవేశించి ప్రభుత్వం ప్రజల మధ్యం నిప్పు రాజుకుంటుంది.


 పాకిస్తాన్  అల్లర్లతో మండుతుంది.. సరిహద్దులు మందుగుండు సామగ్రితో నిండిపోయే సమయం ఇదే. సైన్యం ఒకేసారి రెండు యుద్ధాలు చేయవలసి ఉంటుంది, ఒకటి లోపలి తిరుగుబాటు... రెండవది బయటి యుద్ధం.


శని (Shani) సంవత్సరం పొడవునా మీన రాశి నుంచి పన్నెండవ ఇంట్లో ఉంటాడు, దీనివల్ల అప్పులు, విదేశీ ఒత్తిడి, రహస్య కుట్రలు పెరుగుతాయి. జూలై 27 నుంచి డిసెంబర్ 11, 2026 వరకు శని తిరోగమనంలోకి ప్రవేశించి ఈ సంక్షోభాన్ని రెట్టింపు చేస్తాడు. పాకిస్తాన్ (Pakistan) ప్రజాస్వామ్యం చివరి శ్వాసలు తీసుకునే సమయం ఇదే.


2026  జనవరి నుంచి జూలై వరకు తిరుగుబాటు, ప్రజల అసంతృప్తి...


జూన్ నుంచి అక్టోబర్ వరకు పేదరికం  విదేశీ బానిసత్వం


అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రాజకీయ సంక్షోభం


ఈ మూడు దశలు పాకిస్తాన్‌ను ముక్కలు చేస్తాయి లేదా క్రూరమైన నియంతృత్వ దిశగా నడిపిస్తాయి. ఈ వినాశనం ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. భారతదేశానికి (India) సరిహద్దులో అతిపెద్ద ముప్పు ఏర్పడుతుంది. చైనా - అమెరికా పావులను కదుపుతాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉగ్రవాదం మళ్లీ  ఎగుస్తుంది.  


జ్యోతిష్య గణనల ప్రకారం, 2026 పాకిస్తాన్ (Pakistan)కు వినాశన సంవత్సరం అవుతుంది.  


గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఏ రకమైనసమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.