Horoscope Today 24th December 2024
మేష రాశి
మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ఆనందంగా ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. కార్యాలయంలో సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. మీ సామర్థ్యాలను నిరూపించుకోవడంలో మీరు విజయం సాధిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి వారు ఈరోజు అదృష్టవంతులు కాబోతున్నారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. స్నేహితుల ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందుతారు. ఆధ్యాత్మిక ఆలోచనల ప్రభావం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇస్తారు.
మిథున రాశి
ఈ రోజు మిథునరాశి వారికి బలహీనమైన రోజు కావచ్చు. ఏ పనితోనూ పూర్తిగా సంతృప్తి చెందలేరు. మీరు మీ విలువను నిరూపించుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ దృష్టి స్పష్టంగా ఉంటుంది.
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈ రోజు మీ ప్రయత్నాలలో విజయం పొందుతారు. మీరు కోర్టు కేసుల్లో మంచి ఫలితం సాధిస్తారు. మీ కెరీర్‌లో అద్భుతమైన అవకాశాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మీ సమన్వయం చాలా బాగుంటుంది. ఈరోజు అదృష్టవంతులు కాబోతున్నారు. ఆర్థిక లాభం ఉంటుంది. అధికారుల పట్ల మీ ప్రవర్తన మెరుగ్గా ఉండేలా చూసుకోండి. సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కన్యా రాశి
కన్యా రాశి వారు ఈరోజు వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీ మాటలకు చాలా మంది ప్రభావితం అవుతారు. మీ పనితీరుతో ప్రసంసలు అందుకుంటారు. నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. సన్నిహితుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు.
తులా రాశి
తులా రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎవరితోనైనా వివాదాలు తలెత్తవచ్చు. రుణ లావాదేవీల వల్ల నష్టం ఉంటుంది. పాత విషయాలు పరిష్కారమవుతాయి. రిస్క్ తీసుకోకండి. మీరు కొత్త వ్యక్తులను కలవవచ్చు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీ పనుల్లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక లాభం ఉంటుంది. వృత్తికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. ఉద్యోగ విషయాల్లో మీకు అదృష్టం కలిసొస్తుంది. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. సాహిత్య రచనతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనాలను పొందవచ్చు.
Also Read:
ధనస్సు రాశి
ఈ రాశి వారు తమ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీరు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించి పెద్ద ప్రణాళికలు వేస్తారు. మీరు మీ చదువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మేధోపరమైన వ్యవహారాల్లో అడుగు ముందుకు వేస్తారు.
మకర రాశి
ఏ పని పట్ల అయినా విముఖత కలిగి ఉంటారు. సీనియర్ సిటిజన్ల పట్ల గౌరవంగా వ్యవహరించండి. ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
Also Read: 2025 లో సూర్యగ్రహణం రోజే శని సంచారంలో మార్పు.. ఈ 3 రాశులవారికి అదృష్టం మామూలుగా ఉండదు!
కుంభ రాశి
కుంభ రాశి వారు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అసూయను వీడండి. ఉద్యోగం - వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. చేపట్టిన పని చెడిపోతుందనే భయం మీలో ఉంటుంది. ఈ రోజు ప్రశాంతంగా గడుపుతారు.
మీన రాశి
మీన రాశి వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పిల్లల పట్ల తన బాధ్యతలను నిర్వర్తిస్తాడు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టడంలో సక్సెస్ అవుతారు. మీ జీవిత భాగస్వామి మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ప్రేమికులకు టైమ్ కలిసొస్తుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.