Royal Enfield Classic 350 on EMI: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు ఉంది. కంపెనీలో ఇటువంటి అనేక బైక్‌లు ఉన్నాయి. వాటి రూపం, పనితీరు కారణంగా వాటిని చాలా మంది కొనుగోలు చేస్తారు. అటువంటి బైక్‌లలో ఒకటి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350. దీని పాత, ఫేమస్ డిజైన్ కారణంగా ప్రజలు దీన్ని చాలా ఇష్టపడతారు. కంపెనీకి చెందిన బెస్ట్ సెల్లింగ్ బైక్ ఇదే.


మీరు పూర్తి ధర చెల్లించి ఈ బైక్‌ను కొనుగోలు చేయలేకపోతే ఈఎంఐ ఆప్షన్‌ను కూడా పొందుతారు. దీని కోసం మీరు డౌన్ పేమెంట్, ఈఎంఐల గురించి కూడా తెలుసుకోవాలి. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను మీరు ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం. 


దీని ఆన్ రోడ్ ధర ఎంత?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ. 2.3 లక్షల వరకు ఉంటుంది. రూ.20 వేలు డౌన్‌ పేమెంట్‌ చెల్లించి ఈ బైక్‌ను కొనుగోలు చేస్తే, దీని కోసం మీరు బ్యాంకు నుంచి రూ.2.09 లక్షల రుణం తీసుకోవలసి ఉంటుంది. అది మీకు 10 శాతం వడ్డీ రేటుతో లభిస్తుంది.



Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?


ప్రతి నెలా ఎంత వాయిదా చెల్లించాలి?
లోన్ కాల వ్యవధి గురించి మాట్లాడితే ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది. ప్రతి నెలా ఈఎంఐని తిరిగి చెల్లించాలి. మీరు ప్రతి నెలా వాయిదాగా రూ.7,859 చెల్లించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీ ఈఎంఐ, లోన్ అకౌంట్ మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.


రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 పవర్ ట్రైన్
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో 350సీసీ సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 6,100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. 4,000 ఆర్పీఎం వద్ద 27 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఇంధన సామర్థ్యం 13 లీటర్లు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.99 లక్షలుగా ఉంది. అదే సమయంలో దాని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 2.30 లక్షల వరకు ఉంటుంది.



Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!