Horoscope Today 13th December 2024
మేష రాశి
మేష రాశి వారు పని ప్రదేశంలో కష్టపడి విజయం సాధిస్తారు. మీ విజయాల గురించి గర్వపడకండి. సరైన విచారణ లేకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. మీ ప్రతిభను మిత్రులు గౌరవిస్తారు.
వృషభ రాశి
రాత్రి వేళల్లో ఎక్కువ దూరం ప్రయాణించవద్దు. పాత జ్ఞాపకాలు మళ్లీ తాజాగా మారతాయి. మీ కళా నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. వ్యాయామం ధ్యానంపై దృష్టి సారించండి. విద్యార్థులు ఉన్నత విద్యలో సమస్యలను ఎదుర్కొంటారు.
మిథున రాశి
ఈ రోజు ప్రారంభంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు రూపొందించిన నియమాలను మీరే విస్మరించవద్దు. తోబుట్టువుల విషయంలో కొంత ఒత్తిడికి లోనవుతారు. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడతారు.
Also Read: పులి రియల్ గానే కాదు కలలో కనిపించినా ప్రమాదమే.. దేనికి హెచ్చరికో తెలుసా!
కర్కాటక రాశి
కుటుంబంలో ఉండే వృద్ధులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో వచ్చిన అడ్డంకులను అధిగమిస్తారు. ప్రేమ సంబంధాలలో పరస్పర అంకితభావం పెరుగుతుంది. మీరు కార్యాలయంలో ప్రమోషన్ పొందవచ్చు. వివాదాస్పద సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది
సింహ రాశి
ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు పొందుతారు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కన్యా రాశి
ఈ రాశివారు వ్యాపార పర్యటనకు అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. శారీరక, మానసిక అలసట ఉంటుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.
తులా రాశి
తులా రాశి వ్యక్తులు ఏ పనిని శ్రద్ధ లేకుండా చేయవద్దు. సామాజిక , వృత్తిపరమైన రంగాలలో కొత్త ప్రత్యర్థులు ఏర్పడవచ్చు. జ్యోతిష్యం , ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యక్తిగత సంబంధాలలో సందేహాస్పద భావాన్ని పెంచుకోవద్దు.
వృశ్చిక రాశి
ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. పిల్లల విజయంతో సంతోషిస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఏదైనా శుభకార్యక్రమంలో పాల్గొనవచ్చు. పెళ్లికాని వ్యక్తులకు వివాహం నిశ్చయం అవుతుంది
Also Read: 6 నెలలు చికాకులు 6 నెలలు ప్రశాంతత .. గృహం , వాహన యోగం - మిథున రాశి వార్షిక ఫలితాలు 2025!
ధనుస్సు రాశి
ఈ రాశి వారు వ్యాపారాన్ని ప్రారంభించడంలో విజయం సాధిస్తారు. మీ మాటలో సంయమనం పాటించండి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ప్రవర్తనలో సరళంగా ఉండండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార పనులకోసం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
మకర రాశి
ఈ రోజు ఏదో ఆలోచనలో డల్ గా ఉంటారు. విద్యార్థులు చదువుతో పాటు అదనపు పనులు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. దంపతులకు శుభవార్తలు అందుతాయి. మీ జీవన ప్రమాణం పెరుగుతుంది
కుంభ రాశి
ఈ రాశివారికి కళారంగంలో ఆసక్తి పెరుగుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీ స్వంత వ్యాపారాన్ని చూసుకోండి .. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంలవు అందుకుంటుంది. మీ ప్రియమైనవారికి మనసులో మాట చెప్పేయండి
Also Read: వృషభ రాశి వార్షిక ఫలితాలు 2025 - ఒక్క నెల మినహా ఏడాది మొత్తం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది
మీన రాశి
ఈ రాశివారు భాగస్వామ్య వ్యాపారం చేసినట్టైతే పారదర్శకత కొనసాగించండి. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. మార్కెటింగ్ సంబంధిత వ్యాపారం నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యమైన వస్తువులను భద్రపరచండి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.