మేష రాశి
ఈ రాశి వారు ఏదో విషయంలో భావోద్వేగానికి గురవుతారు. మీ ప్రేమ భాగస్వామికి సమయం కేటాయిస్తారు. దంపతుల మధ్య అద్భుతమైన అవగాహన ఉంటుంది. లాంగ్ టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
వృషభ రాశి
మీ మనసులో చెప్పాలి అనుకుంటే ఇదే మంచి సమయం..ఇంకా ఆలస్యం చేయకుండా చెప్పేయడమే మంచిది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు పెళ్లికి సంబంధించి ప్లాన్ చేసుకుంటారు. వివాహితుల జీవితం బావుంటుంది.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారి ప్రేమజీవితం అద్భుతంగా ఉంటుంది...ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. దంపతుల మధ్య సంతోషం ఉంటుంది. అనవసర విషయాల గురించి వాదన పెట్టుకోవద్దు..వాదనను పొడిగించవద్దు.
కర్కాటకం రాశి
ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీ ప్రేమభాగస్వామికి చెప్పడం ద్వారా మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. బంధాన్ని బలోపేతం చేసుకోవాలి అనుకుంటే సమయం ఇవ్వాలి. మీ వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో మునుగుతూ కుటుంబానికి సమయం కేటాయించలేరు.
Also Read: ప్రేమ, క్షమ, ఆత్మాభిమానం, సహనానికి కేరాఫ్ - అందుకే యుగయుగాలకు ఆమె ఆదర్శం
సింహ రాశి
ఈ రోజు ఈ రాశివారు కాస్త ఆలోచించి మాట్లాడాలి. జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండండి. ఆలోచనాత్మకంగా మాట్లాడకపోతే చిన్న విషయం కూడా పెద్దగా మారుతుందని గుర్తుంచుకోండి. బంధం కొనసాగాలి అంటే కాస్త తగ్గాలి మరి.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారు ప్రత్యేకమైన వ్యక్తిని కలుస్తారు. కొన్నాళ్లుగా సాగుతున్న మీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పడే సమయం ఇది. మనసులో మాట చెప్పాలి అనుకుంటే సంకోచించవద్దు. స్నేహితులతో కూడా సంతోష సమయం గడిపేందుకు ప్లాన్ చేసుకుంటారు.
తులా రాశి
ఈ రాశివారికి ప్రేమికుల నుంచి అయినా జీవిత భాగస్వామి నుంచి అయినా పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. బహుమతులు ఇవ్వడం ద్వారా వారు మీకు ఎంత ప్రత్యేకమో చెబుతారు.
Also Read: 12 ఏళ్ల తర్వాత ఏర్పడిన నవపంచమ రాజ్యయోగం, ఈ 3 రాశుల వారికి మహర్థశ
వృశ్చిక రాశి
మీ భాగస్వామికి మీ మనసులో మాట చెప్పడం ద్వారా బంధాన్ని మరోమెట్టు ఎక్కించగలరు. ఎలాంటి విషయాలను అయినా పంచుకోండి..కొన్ని సమస్యలనుంచి బయటపడేందుకు మీజీవిత భాగస్వామి సహకారం మీకు చాలా అవసరం.
ధనుస్సు రాశి
ఈ రాశివారిలో ఉన్న అహం..వీరి భాగస్వామి అసంతృప్తికి కారణం అవుతుంది. జీవితంలో కొత్త ప్రేమ బంధాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు కలుగుతాయి. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తారు. రోజును వృథాగా పోనివ్వకండి.
మకర రాశి
రకరకాల కారణాల వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేరు..ఫలితంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. అలాంటి వాతావరణం నుంచి బయటపడాలంటే మీకు మీరుగా ఆలోచించి సమయం ఇవ్వండి. వారు మీకు ఎంత ప్రత్యేకమో తెలియజేస్తే వారికి కూడా మీరు ఎంత ప్రత్యేకమో అర్థం అవుతుంది.
కుంభ రాశి
కోపంగా వద్దు..ప్రేమగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. అనవసర విషయాలపై చర్చ పెట్టడం వల్ల బంధం మధ్య చీలక వచ్చే అవకాశం ఉంది. సంతోషకరమైన జీవితం కావాలంటే కాస్తంత ఓపిక, సహనం ఉండాలి మరి.
మీన రాశి
ప్రేమ వివాహం గురించి ఆలోచిస్తున్న వారు ఈ రోజు తమ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడాలి.. వారి నుంచి సానుకూల స్పందన రాబట్టుకున్న తర్వాత కుటుంబాలతో మాట్లాడండి. వివాహితుల మధ్య కూడా బంధం బాగానే ఉంటుంది. .