Love Horoscope Today 7th May 2023
మేష రాశి
ఈ రాశి ప్రేమికులు ప్రేమలో మోసపోతారు. ఒంటరిని అనే భావన పేరుకుపోతుంది..కానీ..మీ జీవితంలో ఇది కీలకమైన దశ. దీన్ని అధిగమించి ముందుకుసాగడం తప్పదని గుర్తుంచుకోవాలి. మీ కెరీర్ పై దృష్టిసారిస్తే వృద్ధిలోకి వస్తారు. ఇదే సమయంలో మీకు జీవితాంతం మద్దతుగా ఉండే కొందరు స్నేహితులను సంపాదించుకోగలుగుతారు.
వృషభ రాశి
ప్రేమ భాగస్వామిని అయినా జీవిత భాగస్వామిని అయినా అర్థం చేసుకోవడం అంటే గంటలతరబడి మాట్లాడడం కాదని గుర్తుంచుకోవాలి. వారిపట్ల మీకు ఉన్న ప్రేమను, మీ జీవితంలో వారెంత ముఖ్యమో తెలియజేసేందుకు ప్రయత్నించండి. మీ భాగస్వామిని పూర్తిగా విశ్వశించండి.
మిథున రాశి
ఈ రాశి వారు తమ సహచరులతో వివాదాలకు దూరంగా ఉండండ మంచిది. ఒకరినొకరు సన్నిహితంగా భావించే క్షణాలొస్తాయి.. ఆస్వాదించండి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు వివాహం దిశగా అడుగేస్తారు. వివాదాలతో విడిపోయిన భాగస్వాములు తిరిగి ఒక్కటయ్యే సూచనలున్నాయి.
Also Read: మరణ సమయంలో ఈ 4 వస్తువులు ఉంటే స్వర్గం ఖాయం..!
కర్కాటక రాశి
ఈ రాశివారు మనసులోంచి అభద్రతా భావాన్ని తొలగించాలి. మీ ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు. మీ ఆలోచనలు, కోరికలు తారాస్థాయిలో ఉంటాయి కానీ సాధ్యాసాధ్యాలు గుర్తించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కోపాన్ని, అసహనాన్ని విడిచిపెట్టండి.
సింహ రాశి
ఈ రాశివారు ఉన్నంతలో తృప్తికరమైన జీవితం గడుపుతారు. ప్రేమ సంబంధాల్లో ఎదుటివారి ఇబ్బందిని గమనించి ముందుకు నడుచుకోవడం మంచిది. మీ జీవిత భాగస్వామికి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. జీవితంలో కొన్ని మార్పులు సహజం..వాటిని అనుసరిస్తూ సాగిపోవడమే.
కన్యా రాశి
ఈ రాశివారు తమ భాగస్వాములను బుజ్జగించుకోవడమే సరిపోతుంది. రానున్న రోజుల్లో ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. మీ ప్రియమైనవారు మీ నుంచి కోరుకునేది స్వచ్ఛమైన నవ్వు అని తెలుసుకోండి. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు మీ జీవితంలో ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. మీ వైవాహిక బంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని మందుకుసాగేందుకు ప్రేమికులకు ఇదే మంచి సమయం. స్నేహితులు , బంధువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఓ ప్రత్యేక సందర్భం కోసం వేచి ఉంటారు. ఇంట్లోవారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ జీవితంలో ఈ దశ కొత్త ఉత్సాహాన్నిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంధం మరింత దృఢంగా మార్చుకోవాలి.
ధనుస్సు రాశి
ఈ రాశి ప్రేమికులు తమ భాగస్వామి భావాలను అర్థంచేసుకోవడం, పరిగణలోకి తీసుకోవడం చాలా అవసరం. చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో మాధుర్యం తగ్గే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. కొత్త బంధాలను ప్రారంభించేముందు వారితో నిజాయితీగా వ్యవహించేందుకు సిద్ధపడండి.
Also Read: ఈ కారణంగానే మనం మన పూర్వ జన్మను మరచిపోతాం!
మకర రాశి
ఈ రాశివారు ఆకర్షణీయంగా ఉంటారు. కొత్త బంధాలు ఏర్పరుచుకునేందుకు ఇదే మంచిసమయం. ప్రేమికుల మధ్య ఏదో చిన్న విషయంపై గ్యాప్ వస్తుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి ప్రేమను పొందుతారు.
కుంభ రాశి
ఈ రాశి ప్రేమికులకు ఈరోజు అద్భుతమైన రోజు. పెళ్లిదిశగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అసలు ప్రేమను వ్యక్తపరచని వారు మనసులో మాట చెప్పేందుకు మంచిరోజు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంగి. మీ భాగస్వామికి మంచి బహుమతి అందిస్తారు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి.
మీన రాశి
ఈ రాశివారు ప్రేమ వ్యవహారంలో మోసపోవచ్చు కానీ జీవితంలో ఓ మెట్టు పైకెక్కుతారు. కొన్ని విషయాల్లో మీరు చొరవగా వ్యవహరిస్తే మీ ప్రతికలా నిజమవుతుంది. మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం.