Horoscope Today 20th January 2023 :  ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...


మేష రాశి
భార్యాభర్తల మధ్య సామరస్యం నెలకొంటుంది. ఒంటరి వ్యక్తుల జీవితంలో భాగస్వామి కోసం అన్వేషణ పూర్తవుతుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామికి సమయం కేటాయించండి.


వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు. వైవాహిక జీవితం సాధారణంగా సాగుతుంది. అనవసర వాదనకు పెట్టుకోవద్దు. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే ఇంట్లో వాతావరణం అంత ప్రశాంతంగా ఉంటుంది


మిథున రాశి
అవివాహితుల పెళ్లి సంబంధాల వేట ఓ కొలిక్కివస్తుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అనవసర వాదనల భారాన్ని అనుభవిస్తారు కానీ కొద్దిరోజుల్లో అంతా బావుంటుంది. మీ భాగస్వామిపై ఒత్తిడి తీసుకురావద్దు.


Also Read: రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!


కర్కాటక రాశి 
చర్చకు దూరంగా ఉండండి. రిలేషన్ షిప్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా చూసుకోవాలి. ఆల్రెడీ ఉన్న శాంతిని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఇది మీకు చాలా ప్రశాంతతను ఇస్తుంది.


సింహ రాశి
జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. ఈరోజు చిన్న చిన్న విషయాలకు గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ కంటే పెద్దవారు మీకారణంగా ప్రభావితమవుతారు.


కన్యా రాశి
ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. భార్యాభర్తల మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటాయి. ప్రేమికులకు మంచి రోజు. బంధాన్ని బాధ్యతగా ఫీలవండి...


తులా రాశి
ఒంటరి వ్యక్తులు భాగస్వామిని పొందుతారు. పెళ్లి చేసుకోవాలి అనుకునే జంట ఆ దిశగా అడుగేసేందుకు మంచిరోజు. ఈ రోజు మొదలైన బంధం ఎక్కువ కాలం కొనసాగుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది.


వృశ్చిక రాశి
ప్రేమికులకు తమ ప్రేమికుల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మీ సహోద్యోగితో  మీ బంధం బలంగా ఉంటుంది. ఈ రోజు మీరు ప్రేమను వ్యక్తపరిస్తే పాజిటివ్ రిప్లై వచ్చే అవకాశం ఉంది.


ధనుస్సు రాశి 
మీకు ఈ రోజు మంచి రోజు. అవివాహితులు ఈ రోజు ప్రత్యేకంగా ఒకరిని కలసి మనసులో మాట చెప్పేందుకు ప్రయత్నిస్తారు.  వైవాహిక బంధం బాగానే ఉంటుంది. ప్రేమికులకు మంచిరోజు


Also Read: ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడొచ్చింది, సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి


మకర రాశి 
మీ భాగస్వామి తప్పులను మరీ లాగకండి..ఇంట్లో ప్రశాంతవాతావరణం దెబ్బతింటుంది. ఈ రోజు మీకు కొత్త స్నేహితుడి నుంచి వచ్చే ఆఫర్..గందరగోళానికి గురిచేస్తుంది. జీవిత భాగస్వామితో ఏకాంత సమయం గడిపే అవకాశం వస్తుంది.  


కుంభ రాశి
మీ భావాలను భాగస్వామితో పంచుకుంటారు. చెడు సంబంధాలను వదులుకునేలా చేసేందుకు మీ ప్రయత్నం మీరు చేయండి. కొత్తగా మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎక్కువరోజులు ఉండరు..వైవాహిక జీవితం బావుంటుంది. 


మీన రాశి
ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ భాగస్వామితో విభేదాల నుంచి ఉపశమనం పొందుతారు. భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. అవివాహితులు వివాహ ప్రతిపాదనలు పొందుతారు.