Horoscope Today November 27, 2024
మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఎప్పటి నుంచో రావాల్సన డబ్బు చేతికందుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆస్తి సంబంధిత వ్యవహారాల నుంచి లాభపడతారు.
వృషభ రాశి
మీ సహాయాన్ని అర్థించేవారికి అండగా నిలవండి. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నవారు శుభఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు మంచి రోజు.
మిథున రాశి
ఈ రాశివారికి మాటపై నియంత్రణ అవసరం. ఎవరినైనా గుడ్డిమా నమ్మి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజు ఆస్తికి సంబంధించిన వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. సామాజిక సామరస్యం అలాగే ఉంటుంది.
Also Read: మకర రాశిలోకి విలాసాధిపతి - డిసెంబరు 02 నుంచి ఈ రాశులవారు కొంత జాగ్రత్తపడండి!
కర్కాటక రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. మీ జీవితంలో మంచి రోజులొస్తున్నాయి. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద భాగస్వామ్య వ్యాపారంలో భాగం అవుతారు. ఈరోజు కుటుంబంలో పరస్పర ప్రేమ కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారమవుతాయి
సింహ రాశి
ఈ రోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మానసికంగా ఇబ్బందిగా కనిపిస్తారు. మీరు చేయడానికి ప్రయత్నిస్తున్న పని విఫలం అవడంతో నిరాశ చెందుతారు. వ్యాపారంలో సమస్యలు ఉంటాయి. ఈ రోజు మీరు అప్పు చేయాల్సి రావొచ్చు.
కన్యా రాశి
ఆరోగ్య సంబంధిత సమస్యల ప్రభావం ఆర్థిక స్థితిపై పడుతుంది. ఈ రోజు మీరు కుటుంబం కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు.. అది మీకు భవిష్యత్ లో మంచి చేస్తుంది. నూతన ఆస్తి, భవనం కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తారు. సన్నిహితుల సహాయం తీసుకుంటారు.
Also Read: భారీగా పెరిగిన అయ్యప్ప ఆదాయం, వసతిపై కొత్త విధానం..శబరిమల భక్తులకు కీలక అప్ డేట్స్!
తులా రాశి
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తిచేస్తారు. మీ భవిష్యత్ కి ఉపయోగపడే వ్యక్తులను కలుస్తారు. ఈ రోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు మంచిది. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి. కుటుంబంలో ఆస్తి తగాదాలు ఎదురుకావొచ్చు.
వృశ్చిక రాశి
ఈ రోజు అనుకున్న పనులు పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామి అనారోగ్యంతో బాధపడతారు. ఈ రోజు మీరు కొన్ని కొత్త ఆస్తి సంబంధిత పనులను ప్రారంభించవచ్చు. షేర్ మార్కెట్ లో పనిచేసే వారు లాభాలు అందుకుంటారు.
ధనస్సు రాశి
ఈ రోజు శుభవార్త వింటారు. కుటుంబంలో కొత్త సభ్యుల రాక ఉంటుంది. మీరు వ్యాపారంలో పెద్ద భాగస్వామిగా మారుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది.
మకర రాశి
మీరు ఈ రోజు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. వ్యాపార రంగంలో నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. శత్రువుల కుట్రలకు బలవుతారు. అప్రమత్తంగా వ్యవహరించండి. అపరిచితులను నమ్మవద్దు. ఈరోజు ఆరోగ్య సమస్యలకు డబ్బు ఖర్చు చేస్తారు.
Also Read: శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
కుంభ రాశి
ఈ రోజు ప్రమాదకర పనులు చేయండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయి.
మీన రాశి
మీరు కార్యాలయంలో కొన్ని కొత్త పని ప్రారంభించే అవకాశం ఉంది. మీకు శుభవార్త అందుతుంది. ఓ పెద్ద బాధ్యత పూర్తిచేసిన తర్వాత సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అప్పుల నుంచి విముక్తి పొందుతారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.