Horoscope Today November 17, 2024


మేష రాశి
ఈ రోజు మనసు కలవరపడవచ్చు..ఏదో విషయాలపై అస్థిరంగా ఉంటారు...అందుకే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. డబ్బు సంబంధిత విషయాలకు రోజు చాలా అనుకూలమైనది. ఉద్యోగంలో ఒత్తిడి లేని వాతావరణం ఉంటుంది. సంతోషంగా టైమ్ స్పెండ్ చేసేందుకు ప్రయత్నిస్తారు.


వృషభ రాశి


ఈ రోజు మీరు మీ పనిని నమ్మకంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. కొన్ని పాత కోర్టుకు సంబంధించిన కేసుల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యక్తులు భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు 


మిథున రాశి


ఈ రోజు మీరు బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఉంది.  అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.  మేధోపరమైన పనుల పట్ల ఆసక్తి చూపుతారు. అనారోగ్యాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. ఆహార నాణ్యతను జాగ్రత్తగా చూసుకోండి.


కర్కాటక రాశి


ఈ రోజు మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. అహంకారానికి దూరంగా ఉండండి.  ఇంటి పనులలో బిజీగా ఉంటారు.  ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశాలలో ఆటంకాలు తొలగిపోవచ్చు. ఈరోజు   స్నేహితులతో సరదాగా గడుపుతారు. 


Also Read: శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!


సింహ రాశి
 
ఈ రాశి ఉద్యోగుల పనిలో సామర్థ్యం పెరుగుతుంది.  పదోన్నతిలో ఆటంకాలు తొలగిపోతాయి. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వ్యాధిగ్రస్తులు కొంత ఉపశమనంగా ఫీలవుతారు.


కన్యా రాశి


ఈ రోజు మీరు ఉద్యోగంలో మీ లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొత్త ఆర్డర్లు పొందుతారు కానీ దాన్ని పూర్తి చేయడంలో విఫలం అయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో చాలా ఎమోషనల్ గా ఉంటారు. పూర్వీకుల ఆస్తిలో వాటా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదకర పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.


తులా రాశి


ఈ రోజు సాధారణ రోజు అవుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అహంకారం తగ్గించుకోండి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. అదృష్టం లేకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోవచ్చు. శ్రమతో పోలిస్తే ఆదాయం లేకపోవడం వల్ల అసంతృప్తి ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందుతారు.


వృశ్చిక రాశి


ఈ రోజు ఇంటికి బంధువులు వస్తారు. మీ సలహాతో ఇతరులు  ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితంలో ప్రేమ అలాగే ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. వ్యాపారంలో గొప్ప ఆర్థిక లాభాలు ఉండవచ్చు.


ధనస్సు రాశి


ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  పెండింగ్‌లో ఉన్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన మార్పులు ఉంటాయి. ఇంటి పనులు ప్రాధాన్యతపై పూర్తి చేస్తారు.  


మకర రాశి


ఈ రోజు స్నేహితులతో విభేదాలు రావొచ్చు. ఈ రోజు మీరు ఆధ్యాత్మిక గురువులను కలుసుకుంటారు. కమీషన్ సంబంధిత పనుల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. మీరు ఉద్యోగంలో ఆధిపత్యం వహిస్తారు. ఇతరులను ఎక్కువగా నమ్మడం మంచిది కాదు. 


కుంభ రాశి
 
పని విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు చదువులో, ఉద్యోగులు పనిలో, వ్యాపారులు వ్యాపారంలో ఒత్తిడికి లోనవుతారు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి మద్దతు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మీ ఒక్క పొరపాటు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఓపిక పట్టండి.


Also Read: శని సంచారంతో ఈ రాశులవారికి ఆర్థిక, మానసిక సమస్యలు - మరి పరిష్కారం ఏంటి!


మీన రాశి 


ఈ రోజు మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోండి. పని పట్ల మీ అంకితభావాన్ని అంతా ప్రశంసిస్తారు. కుటుంబ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. కోపంతో ఉన్నప్పడు స్పందించవద్దు. కుటుంబంలో ఉన్న వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.