IND vs AUS Final Win Prediction india vs Australia 


ప్రపంచ కప్ 2023 విజేత ఎవరంటే!
ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్స్ 2023 నవంబర్ 19 ఆదివారం అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ చివరిసారిగా ప్రపంచకప్‌ గెలుచుకుంది. ఆ ఏడాది విజేతగా నిలిచేది భారత్ అని జ్యోతిష్య శాస్త్ర పండితులు ముందే చెప్పారు. మరి 2023 ఫైనల్స్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఆట ఎలా ఉండబోతోంది అన్నది కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. 


Also Read: అది తప్ప మరే శక్తీ అడ్డుకోలేదు - టీమిండియాకు మాజీల హితబోధ


ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో భారతదేశం ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ డ్రీమ్ రన్‌లో ఉంది. ఆరంభం నుంచి ఫైనల్స్ వరకూ జైత్రయాత్ర కొనసాగించారు. తగ్గేదే లే అన్నట్టు దూసుకెళ్లారు. సెమీ ఫైనల్స్ లోనూ ఉత్కంఠ పోరుమధ్య న్యూజిలాండ్ ను ఓడించారు. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే ఆట నిరాశగా ప్రారంభించి ఉండొచ్చు...మొదటి రెండు గేమ్‌లను ఓడిపోయి ఉండొచ్చు కానీ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. సెమీస్ లో సౌత్ ఆఫ్రియాను ఓడించి ఫైనల్లో బెర్త్ ఖరారు చేసుకున్నారు. మరి ఫైనల్లీ విజేతగా నిలిచేదెవరు? ఈ సారి ప్రపంచ  కప్ టోర్నీ భారత్ విజయంతో ముగుస్తుందా అంటే వందశాతం జరిగేది అదే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. 


Also Read: ఆస్ట్రేలియాతో.. తస్మాత్‌ జాగ్రత్త , ఈ ఆటగాళ్లతో అప్రమత్తంగా ఉండాల్సిందే


రోహిత్ శర్మ మరో ధోని
భారత్-ఆస్ట్రేలియా ఇరువైపులా జాతకాలు పరిశీలించి చూస్తే ఆస్ట్రేలియాపై భారత్‌దే పైచేయి అంటున్నారు. ఎందుకంటే భారతదేశం  జాతకం ప్రస్తుతం ఆస్ట్రేలియా కంటే చాలా మెరుగ్గా ఉంది..గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఉత్సాహం, చిత్తశుద్ధి, శక్తి, అంకితభావాన్ని సూచిస్తున్నాయి.  రోహిత్ శర్మ జాతకం ప్రకారం నిరంతరం తనని తాను మెరుగుపచ్చుకోవడంతో పాటూ నాయకుడిగా రాణించేందుకు గ్రహాలు అనుకూల ఫలితాలనిస్తున్నాయి. 2011లో మహేంద్ర సింగ్ ధోనిలానే 2023లో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించడం ఖాయం అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.


భారత్ కు శుక్ర సంచారం అనుకూలం 
శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్, మహ్మద్ షమీ మరియు జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లకు శుక్రుడు,గురు గ్రహాలు బలంగా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. సాధారణంగా శుక్రగ్రహం బలంగా ఉంటే జీవితంలో సంపద, శ్రేయస్సు, ఆనందం, ఆకర్షణ, గౌరవం, విజయం, విలాసవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. అయితే భారతదేశం  8వ స్థానంలో అంగారకుడి ఉనికి ఉండడం వల్ల భారత ఆటగాళ్ళు తమ బలాలపై దృష్టి పెట్టాలి..సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, అతి విశ్వాసాన్ని వదులుకోవాలని సూచిస్తున్నారు. ఏదేమైనా నవంబరు 19 ఆదివారం జరిగే మ్యాచ్ లో కంగారూలను రోహిత్ సేన కంగారు పెట్టడం పక్కా. 


ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు కప్పు కోసం తలపడనున్నాయి. క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్‌-ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ ఫైనల్‌(IND vs AUS Final 2023) మ్యాచ్‌ కోసం బీసీసీఐ(BCCI), ఐసీసీ(ICC) సంయుక్తంగా భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి.