August 2025 Auspicious Yog: జ్యోతిష్య శాస్త్రంలో చాలా శుభయోగాలున్నాయి. గ్రహాల సంచారం ఆధారంగా యోగాలు ఏర్పడతాయి. గ్రహాల కదలిల వ్యక్తుల అదృష్టాన్ని మార్చుతుందని నమ్ముతారు. ధనం, వాహనం, ఆస్తికి సంబంధించిన అడ్డంకులు గ్రహాల కదలిక ద్వారా తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. ఆగష్టులో రెండురాజయోగాల కలయిక ఏర్పడుతోంది. ఈ ప్రభావంతో ఏ రాశులవారికి ప్రయోజనం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. 2025 ఆగష్టులో రెండు శక్తివంతమైన రాజయోగాలు
ఆగస్టులో గ్రహాల కదలికలో పెద్ద మార్పు రాబోతోంది. ఇలాంటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి రెండు రాజయోగాలు ఏర్పడతాయి
మొదటి యోగం - గజలక్ష్మీ రాజయోగం (Gajalakshmi Rajyoga)
ఆగస్టు 20 వరకు మిథున రాశిలో శుక్రుడు మరియు గురువుల శుభ కలయికతో గజలక్ష్మీ రాజయోగం ఉంటుంది. ఈ యోగం ప్రభావంతో వ్యక్తికి ధనం, కీర్తి గౌరవం లభిస్తాయి. ఈ గ్రహాల సంచారం శుభస్థానంలో ఉండే వ్యక్తి జీవితం రాజులా మారుతుంది. ఆ వ్యక్తి సమాజంలో ఉన్నత స్థానం, ప్రతిష్ట పొందుతారు
రెండవ యోగం - లక్ష్మీ నారాయణ యోగం (Lakshmi Narayan Raja Yoga)
ఆగస్టు 21 నుంచి కర్కాటక రాశిలో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావంతో...చేపట్టే ప్రతిపనీ పూర్తవుతుంది. పోరాటం చేయవలసిన అవసరం లేదు..అనుకున్న పని అనుకున్న సమయానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. ధనానికి లోటుండదు. సమయానికి డబ్బు చేతికందుతుంది
ఈ రెండు రాజయోగాలతో ఈ రాశుల వారికి మంచి ప్రయోజనం ఉంటుంది
కర్కాటక రాశి (Cancer)
ఎప్పటి నుంచో ఆగిపోయిన పాత ధనం లభిస్తుంది. వ్యాపారంలో మీ కష్టం ఫలిస్తుంది. ధనధాన్యాలు లభిస్తాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది. మీరు ఏ పని చేసినా, అది విజయవంతంగా పూర్తవుతుంది.
వృషభ రాశి (Taurus )
వృషభ రాశి వారికి కూడా ఆగస్టు చాలా అనుకూలంగా ఉంటుంది. లాభదాయకంగా ఉంటుంది. ఈ యోగం ప్రభావంతో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో గొప్ప విజయం లభిస్తుంది. కుటుంబం సంతోషంగా ఉంటుంది. కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరుకుంటారు.
మిథున రాశి (Gemini )
గజలక్ష్మీ రాజయోగం, లక్ష్మీ నారాయణ యోగం మిథున రాశివారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితం, ప్రేమ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. సానుకూల మార్పులు కనిపిస్తాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి. పూర్తి వివరాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించండి
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి