జులై 30 శుక్రవారం రాశిఫలాలు 



మేషం
ఈ రోజు మీకు స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది.  అపరిచితుల పట్ల జాగ్రత్తగా వ్యవహించండి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  కెరీర్ సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు  శుభవార్త వింటారు.


వృషభం
వృషభరాశివారికి ఈరోజు బిజీబిజీగా ఉంటారు. ఓ పని విషయంలో అయోమయంలో పడతారు. బిజీ షడ్యూల్ ఉన్నప్పటికీ భాగస్వామికి సమయం కేటాయించండి. ఏదో ఒక సంఘటన గురించి భయపడతారు. ఆరోగ్యం జాగ్రత్త.  యోగా, ధ్యానం చేయండి. రిస్క్ తీసుకోవద్దు, వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. 


మిథునం
అప్పిచ్చిన డబ్బులు చేతికందే అవకాశం ఉంటుంది. మీ ఖర్చులను నియంత్రించగలుగుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  వ్యాపారవేత్తలు ఊహించని విజయాన్ని పొందుతారు. స్నేహితులతో సంతోషంగా స్పెండ్ చేస్తారు. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. 


కర్కాటకం
మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓపికగా ఉండండి. ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించి శుభవార్త వింటారు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. క్రొత్త సమాచారం అందుబాటులో ఉంటుంది. వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం. 





సింహం
సింహరాశివారికి ఈరోజు బాగా కలిసొస్తుంది. అవసరానికి డబ్బు చేతికందుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతారు. కొత్త వ్యాపార ప్రణాళికలు చేయండి. ప్రమాదంతో కూడిన పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే ఈరోజు ఓకొలిక్కి వస్తాయి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. 


కన్య
కన్య రాశివారు కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటారు.  మీ ఆరోగ్యం బావుంటుంది. కొందరితో అభిప్రాయ బేధాలుంటాయి...లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగవాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సకాలంలో బాధ్యతలు పూర్తిచేస్తారు. కొత్త వ్యవహారాలు ఈరోజు ప్రారంభించవద్దు. .


తుల
తుల రాశివారికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ రోజు చాలా చురుకుగా ఉంటారు. ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. 


వృశ్చికం
ఓ పని పూర్తిచేయకపోవడం వల్ల ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదృష్టం మీద ఆధారపడొద్దు...కష్టపడండి. పాతస్నేహితులను కలుస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. పెట్టుబడులు పెట్టొద్దు. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇతరులకు సహాయం చేయాలనే భావన ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. 




ధనుస్సు
ఏదో సమస్య గురించి ఆందోళన చెందుతారు. బంధువుల నుంచి అవసరమైన సమాచారం పొందుతారు. వ్యాపారం అనుకున్నంతగా సాగదు. స్నేహితులు ముఖం చాటేస్తారు. కార్యాలయాల్లో పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. అనవసర ఖర్చులు తగ్గించండి. 
 
మకరం
మరక రాశివారు ఈరోజు జాగ్రత్తంగా ఉండండి. మంచి పనులకు డబ్బు ఖర్చుచేస్తారు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇతరులతో కలసి పనులు పూర్తిచేయడంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. కార్యాలయంలో సవాళ్లు తప్పవు. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. 


కుంభం
కుంభ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. మనసులో కొంత ప్రతికూల ఆలోచన కారణంగా ఆచరణలో లోపం ఉంటుంది. స్థిరాస్థి కొనుగోలు చేయాలి అనుకున్న వారికి శుభసమయం.  వ్యాపారవేత్తలు, విద్యార్థులకు మంచిరోజు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బంధువులను కలుస్తారు. 


మీనం
మీన రాశివారికి బాగా కలిసొస్తుంది.  కొత్త పనులు ప్రారంభిస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి. కష్టపడి పనిచేస్తే తగిన ఫలితం పొందుతారు. పెట్టుబడులకు సంబంధించి నిపుణుల సలహాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటారు. రుణాలు ఇవ్వొద్దు. ఖర్చులు నియంత్రించండి.