మార్చి 11 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీ సలహాలు అందరకీ ఉపయోగపతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. బంధువులను కలుస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సందేహాలకు అవకాశం ఇవ్వొద్దు. 


వృషభ రాశి


ఈ రోజు సంతోషంగా ఉంటారు. బాధ్యతాయుతమైన పనులను ముందుగా పూర్తిచేయడం మంచిది. జీవిత భాగస్వామితో వివాద సూచనలున్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ఫలితాలు సాధిస్తారు. 


మిథున రాశి


ఈ రోజు మీరున్న రంగంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఓ గుడ్ న్యూస్ వింటారు. వివాహ బంధం బావుంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. 


కర్కాటక రాశి


అనవసర చర్చలకు ఈ రోజు అవకాశం ఇవ్వొద్దు. పని ఒత్తిడి పెరుగుతుంది. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల నుంచి నిర్లక్ష్యానికి గురవుతారు. పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించాలి. మీ హక్కులను వినియోగించుకోవాలి


సింహ రాశి


ఈ రోజు ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రియమైనవారి ప్రవర్తనతో మనసు కలత చెందుతుంది. మీ పాత తప్పులు సరిదిద్దుకునేందుకు ప్రత్నించండి. అప్పులు చెల్లించాలంటూ ఒత్తిడిపై పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో సాధారణ ఫలితాలుంటాయి.


కన్యా రాశి


ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సహోద్యోగుల ప్రవర్తన గురించి ఆందోళన చెందుతారు. మీ సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకోండి. ఈ రోజు మీరు ఎక్కువగా పని సమయంలో ప్రశాంతంగా ఉండాలి.


తులా రాశి


ఈ రోజు కుటుంబంలో ఆనందం ఉంటుంది. పరిస్థితులు పూర్తిగా మీ నియంత్రణలో ఉంటాయి. తీర్థయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తారు. జీవిత భాగస్వామి మీ భావాలను గౌరవిస్తారు.


వృశ్చిక రాశి


ఈ రోజు వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. కొత్త ఇల్లు కొనడం లేదా నిర్మించడం గురించి ఆలోచిస్తారు. గుడ్ న్యూస్ వింటారు. గౌరవప్రదమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.  


ధనుస్సు  రాశి


ఈ రోజు మీ వ్యక్తిగత విషయాలను బయటివారితో పంచుకోవద్దు. అధ్యయనాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు అధ్యయనాల పట్ల దృష్టి పెడతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఇబ్బందిపెడుతుంది.  


మకర రాశి


ఈ రోజు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్లాన్ చేయాలి. టైమ్ మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తిచేస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి 


కుంభ రాశి


ఈ రోజు ఈ రాశివారు ఉద్యోగంపై అసంతృప్తిగా ఉంటారు. చేపట్టిన పనులకు కుటుంబం నుంచి సహకారం అందుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది.వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 


మీన రాశి


కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు చేయాల్సిన పనులపై శ్రద్ధ వహించండి. అనవసర వాగ్ధానాలు చేయొద్దు. ఇంటికి అనుకోని అతిథులు వస్తారు. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.