Daily Horoscope Today December 17th, 2023 ( డిసెంబరు 17 రాశిఫలాలు)
మేష రాశి (Aries Horoscope Today) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ రోజు మీకు మంచిరోజు. మీ కార్యాచరణ ప్రణాళికపై దృష్టి పెట్టాలి. చేపట్రుటే పనిలో విజయం పొందుతారు . గౌరవం పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పులుండవు
వృషభ రాశి (Taurus Horoscope Todayu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు.
మిథున రాశి (Gemini Horoscope Today) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
మిథున రాశివారికి సాధారణ రోజు అవుతుంది. సహనంగా ఉండాలి. కొన్ని విషయాల్లో సంయమనం పాటించాలి. మీరు పని పరంగా కొంచెం కష్టపడవలసి ఉంటుంది. మీ కృషి మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.
Also Read: ఈ రాశివారికి 2024లో అనారోగ్యం, మానసిక ఒత్తిడి తప్పదు - ఆ 3 నెలలు కొంత ఉపశమనం!
కర్కాటక రాశి (Cancer Horoscope Today) (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ రోజు మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలపై శ్రద్ధ వహించాలి. మీ పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందాలి.
సింహ రాశి (Leo Horoscope Today)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఈ రోజు మీకు శ్రేయస్సు మరియు విజయాన్ని కలిగించే రోజు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయడం మంచిది.మీ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయకండి. మీరు ప్రారంభించే పనుల్లో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు.
కన్యా రాశి (Virgo Horoscope Today) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
సాధారణ రోజు అవుతుంది. వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. మీ బంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
తులా రాశి (Libra Horoscope Today) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. సంతోషకరమైన రోజు. మీరు మీ పనిని సజావుగా నిర్వహించాలి. మీ వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలి. సన్నిహితుల నుంచి సహాయం పొందుతారు.
Also Read: ఈ రాశివారికి 2024లో ఈ 4 నెలలు పరీక్షా కాలమే!
వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
వ్యాపారంలో విజయాన్ని చేకూర్చే రోజిది. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం సాధిస్తారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న ఇబ్బందులున్నా ఆరోగ్యం బాగానే ఉంటుంది
ధనుస్సు రాశి (Sagittarius Horoscope Today) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. సహనంగా వ్యవహరించాలి. పని పరంగా కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
మకర రాశి (Capricorn Horoscope Today) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడుల గురించి మరోసారి ఆలోచించాలి. వ్యాపారులు లాభాలు పొందుతారు. విద్యార్థులకు శుభసమయం.
Also Read: 2024లో ఈ రాశులవారు జాగ్రత్త, శనిగ్రహంతో ఇబ్బందులు తప్పవు
కుంభ రాశి (Aquarius Horoscope Today) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఈ రోజు మీకు విజయాన్ని కలిగించే రోజు. వ్యూహాత్మకంగా వ్యవహరించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాల్సిన దగ్గర వెనక్కు తగ్గొద్దు. మీ కుటుంబ సభ్యుల మద్దతు సంపూర్ణంగా పొందుతారు.
మీన రాశి (Pisces Horoscope Today) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి . మానసికంగా అలసటగా అనిపిస్తుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.