Horoscope Today 2023 August 23rd


మేష రాశి
ఈ రోజు మేషరాశి వారికి ఒడిదొడుకులతో కూడి ఉంటుంది. కొత్త పనిని ప్రారంభించవద్దు..నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తప్పవు ఖర్చులు తగ్గించాలి. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి..నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. 


వృషభ రాశి 
ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. బందువులతో విభేదాలున్నాయి జాగ్రత్త. ఉద్యోగులు పని ఒత్తిడి ఎదుర్కొంటారు. ఏదో విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి సరైన సహకారం ఉండదు.  ఈరోజు మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.


మిథున రాశి 
ఈ రోజు ఈ రాశివారికి మంచి రోజు అవుతుంది. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటారు. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు మంచిరోజు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మాటమీద సంయమనం పాటించాలి. మిమ్మల్ని తప్పుదోవపట్టించేవారున్నారు జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.


Also Read: శ్రావణమాసంలో అష్టాదశ శక్తిపీఠాల సందర్శనం శుభకరం - మీరెన్ని దర్శించుకున్నారు!


కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశివారికి ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. కోర్టు కేసులు ఎదుర్కొనేవారికి ఈ రోజు కొంత ఇబ్బందికరమైన రోజు అవుతుంది. వ్యాపారులకు మంచి రోజు..నూతన పెట్టుబడులు పెట్టొచ్చు. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. 


సింహ రాశి
సింహ రాశి వారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. మీ గౌరవం పెరుగుతుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు.  వ్యాపారంలో నష్టాలొచ్చే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలకు సంబంధించి మానసిక ఒత్తిడి ఉంటుంది.  వాదనలు పెట్టుకోవద్దు. అవసరం లేని దగ్గర కూడా ఏదో ఒకటి మాట్లాడే ధోరణి విడిచిపెట్టాలి. ఆస్తికి వివాదాలు కొలిక్కి వస్తాయి. 


కన్యా రాశి 
ఈ రాశివారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా, నూతన ప్రణాళికలు అమలు చేయాలన్నా శుభసమయం. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. విహారయాత్రలు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. ఏదో విషయంలో విచారంగా ఉంటారు. 


తులా రాశి 
ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు తలుచుకుని బాధపడతారు. ప్రతికూల విషయాలు మనసులో ఉంటే తీసేయడమే మంచిది. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులకు మంచి రోజు. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయి కానీ వాటివల్ల మీకు మంచే జరుగుతుంది.


Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!


వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశివారు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. చిన్న చిన్న డిస్కషన్ పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంది. డబ్బు వృధా అవుతుంది. మీ మనసు కలత చెందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి కారణంగా ఇబ్బంది పడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.


ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారు గొడవలకు దూరంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తప్పని పరిస్థితుల్లో కానీ దూర ప్రయాణం చేయొద్దు. నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు మంచి రోజు. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం ఉంటుంది. మీ కెరీర్ విషయంలో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు


మకర రాశి
ఈ రోజు మకర రాశి వారికి మంచి రోజు.  మీ మనసు సంతోషంగా ఉంటుంది.  కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. జీవిత భాగస్వామితో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు ప్రమోషన్ సంబంధించిన సమాచారం వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు.


కుంభ రాశి 
కుంభ రాశివారికి ఈ రోజు కష్టతరమైన రోజు. జీవిత భాగస్వామితో విభేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం  విషయంలో నిర్లక్ష్యం వద్దు.వ్యక్తిగత పనులపై ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొద్దు..నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయవద్దు. ఉద్యోగులు పనిపై నిర్లక్ష్యం వద్దు.


మీన రాశి
ఈ రాశివారు ఈ రోజు ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. గాయపడే ప్రమాదం ఉంది జాగ్రత్త. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.  వ్యాపారంలో ఏదైనా పెద్ద లావాదేవీలు చేయాలనుకుంటే ఈరోజు  ఆ ఆలోచన విరమించుకోవడమే మంచిది. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. పిల్లల గురించి ఆందోళన చెందుతారు.