Horoscope Today 2023 August 17th


మేష రాశి 
ఈ రోజు మేషరాశివారికి లాభదాయకమైన రోజు. వ్యాపారులు ప్రశాంతంగా ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికి మంచి అవకాశం లభిస్తుంది. కోరుకున్న వస్తువులు కొనుక్కుంటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. అయితే కళ్లకు సంబంధించి సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త. 


వృషభ రాశి
ఈ రాశివారికి కుటుంబ వాతావరణం ఆహ్లాదరకరంగా ఉంటుంది. మనసు భారం తేలికపడుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ పనైనా చేయండి. వ్యాపారంలో లాభాలుంటాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలుంటాయి వాటిని మీరు గుర్తించగలగాలి. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. విద్యార్థులకు సమస్యలు పరిష్కారం అవుతాయి. 


మిథున రాశి
ఈ రాశివారికి ఈ రోజు బావుంటుంది. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మంచి సలహాలు, సూచనలు అందుతాయి. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆ విషయంపై మీరు చాలా కష్టపడతారు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి మంచి సమయం. ఏకాంత సమయం గడిపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. 


కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు. మనసులో ఉన్న ఓ గందరగోళం దాతృత్వంతో ముగుస్తుంది. కొంచెం రిలాక్స్ గా అనిపిస్తారు. విద్యార్థులు తమ ఉన్నతికి సంబంధించి మంచి సమాచారం వినే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన అవివాహితుల పెళ్లికి ఇదే మంచి సమయం. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. 


Also Read:  దైవారాధన నుంచి ఖగోళంలో జరిగే అద్భుతాల వరకూ అన్నిటికీ ఈ పురాణాలే ఆధారం!


సింహ రాశి
ఈ రాశివారికి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కొన్ని పొట్ట సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో మీకు అకస్మాత్తుగా డబ్బు రావడం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచుతారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు, దీని కారణంగా మీ కీర్తి పెరుగుతుంది.


కన్యా రాశి
ఈ రాశివారికి ఈరోజు ఫలవంతమైన రోజు అవుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. భవిష్యత్ ప్రణాళికల గురించి  చర్చిస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు ఆర్థికంగా లాభపడతారు. ప్రత్యర్థుల చురుకుదనం వల్ల మీకు ఇబ్బంది రావొచ్చు. ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని తప్పుతోవ పట్టించేవారున్నారు జాగ్రత్త. 


తులా రాశి
ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పులు చేయాల్సి రావొచ్చు. వ్యాపారులకు కొన్ని సమస్యలు తీరుతాయి కానీ నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవివాహితుల వివాహానికి ఎదురైన అడ్డంకులు తీరిపోతాయి. విద్యార్థులు ఉన్నత చదువులవైపు అడుగేసేందుకు మార్గం సుగమం అవుతుంది. 


వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈ రోజు మంచి జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. మీ మాటల్లో మాధుర్యాన్ని కాపాడుకోవాలి. ఏదైనా  విషయంపై చర్చలు జరగొచ్చు. ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు అవుతుంది. బంధువుల నుంచి అప్పులు తీసుకోవడం, ఇవ్వడం మానుకోవాలి. 


ధనుస్సు రాశి
ఈ రాశివారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. వాహనం కొనుగోలు చేయాలన్న కల నెరవేరుతుంది. మీకు అత్యంత ప్రియమైన వ్యక్తి సమస్యను విన్న తర్వాత కొంచెం ఆందోళన చెందుతారు దానిని తొలగించడానికి ప్రయత్నిస్తారు. మనసులో కొన్ని సానుకూల ఆలోచనలు వస్తాయి. అవసరమైన వారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. 


Also Read: అంపశయ్యపై ఉన్న భీష్ముడిని ద్రౌపది అడిగిన ఒకే ఒక ప్రశ్న!


మకర రాశి 
ఈ రాశివారు ఈరోజు ప్రణాళిక ప్రకారం పనులు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులకు ఈ రోజు ఆరంభంలో కొన్ని సమస్యలున్నప్పటికీ ఆ తర్వాత పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. మాటల్లో మాధుర్యాన్ని తగ్గినీయకుండా చూసుకోవాలి


కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు ప్రభావవంతమైన రోజు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు ఈరోజు కార్యాలయంలోని ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొన్ని శుభవార్తలు వింటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి..ప్రమాదం జరిగే అవకాశం ఉంది 


మీన రాశి
ఈ రోజు ఈ రాశివారికి మంచిరోజు అవుతుంది. వ్యాపారంలో నష్టాల కారణంగా ఇబ్బంది పడతారు. భవిష్యత్ ను మెరుగుపర్చుకునే ప్రణాళికల్లో మునిగి ఉంటారు...అందులో సక్సెస్ అవుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం. 


Also Read: మీ దంతాలు ఊడినట్టు కలొచ్చిందా - అది దేనికి సంకేతమో తెలుసా!


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.