8th January 2023 Horoscope Today:  కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశిఈ రోజు మీరు స్నేహితులతో కలసి ఎక్కడికైనా వెళ్లేందుక ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. ఉద్యోగులు సహోద్యోగులతో సన్నిహితంగా ఉంటారు. వ్యాపారం బాగాసాగుతుంది. 

వృషభ రాశిఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి..కంట్రోల్ చేయకపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. రావాల్సిన సొమ్ము చేతికందడం ఆలస్యం అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వివావాదలకు దూరంగా ఉండండి.

మిథున రాశిపనికిరాని విషయాల గురించి వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. చర్చ ద్వారా ఏమీ పొందలేమని గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ ఇంటి బాధ్యతలను విస్మరించడం వల్ల మీతో ఉండే కొందరికి మీపై కోపం వస్తుంది. మీప్రియమైనవారికి దూరంగా ఉండడం మిమ్మల్ని బాధిస్తుంది.

Also Read: సంక్రాంతినే పెద్దపండుగ, పెద్దలపండుగ అంటారెందుకు, దీని విశిష్టత ఏంటి!

కర్కాటక రాశిఒకేసారి అన్ని పనులూ చేయాలని అనుకోవద్దు..మీరు ఇబ్బందుల్లో పడొచ్చు..పైగా ఆ పనుల్లో ఏదీ పూర్తికాదు. శ్రద్ధ పెట్టి పనిచేయండి. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు తమ శ్రమ, ఫలితాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు.

సింహ రాశిఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది.రావాల్సిన డబ్బు నిలిచిపోతుంది. పెరుగుతున్న ఖర్చులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని పనులకు ఊహించిన  దానికంటే ఎక్కువ శ్రమ మరియు సమయం పట్టవచ్చు.

కన్యా రాశిమతపరమైన ప్రదేశానికి వెళ్లి పేదలకు దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు మీకున్న ఇబ్బందులు తొలగిపోతాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఓ శుభవార్త మీకు సంతోషాన్నిస్తుంది.

తులా రాశిఈ రోజు మీకు గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. నగలు, పురాతన వస్తువులపై పెట్టుబడి పెట్టడం ఈ రోజున ప్రయోజనకరంగా ఉంటుంది.ఇది మీ జీవితంలో శ్రేయస్సును తెస్తుంది. ఈ రోజు తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృశ్చిక రాశి ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ మనస్సు ఆరాధనలో మరింత నిమగ్నమై ఉంటుంది.

Also Read: ఈ సంక్రాంతికి ఈ ఐదుపనులు చేసేలా ప్లాన్ చేసుకోండి!

ధనుస్సు రాశిఈరోజు తండ్రితో మీబంధం బావుంటుంది. స్నేహితులతో కలిసి పర్యాటక ప్రాంతానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పాత పెట్టుబడుల వల్ల ఆదాయం పెరుగుతుంది. గృహ జీవితానికి సంబంధించి మనస్సులో కల్లోలం ఉండవచ్చు. మీరు ఉద్యోగ రంగంలో అఖండ విజయం సాధించగలరు.

మకర రాశిఈ రోజు మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. సానుకూల ఆలోచనలకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఆదాయంతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ రోజు స్నేహితుల సాంగత్యం మీకు ఉపశమనం కలిగిస్తుంది.

కుంభ రాశివ్యాపారంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ శ్రమ పెరుగుతుంది. ఈ రోజు మీరు చిన్న విషయాలకే కలత చెందుతారు. ఈరోజు కొన్ని పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. డబ్బు విషయంలో మీరేమీ పెద్ద నిర్ణయం తీసుకోకండి.

మీన రాశిఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో మీకు ఎంతో ప్రయోజనం కలిగించే పాత స్నేహితుడిని మీరు కలుసుకోవచ్చు. మీ దృష్టి అంతా మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంపైనే ఉంటుంది.