మేష రాశి


ఈ రోజు ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మీ ప్రణాళికలు , ఆలోచనలను సమన్వయం చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటారు. ఒకరి కోసం చేసిన సహాయం మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది.


వృషభ రాశి


ఈ రోజు మీకు సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. కుటుంబం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు లభిస్తాయి. పనుల్లో టంకాలు ఎదురవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. 


మిథున రాశి


ఈ రోజు కొత్త వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని చేసే ముందు పెద్దల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. సంతానం చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఉద్యోగులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.


Also Read: మార్చి నెలలో ఈ రాశులవారికి వ్యవహార జయం, ఆర్థిక లాభం


కర్కాటక రాశి 


ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గుర్తింపు ఈరోజు పొందుతారు. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతృప్తికరమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆహారంపై శ్రద్ధ వహించండి. 


సింహ రాశి


ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ ఆలోచనా అవగాహన అభివృద్ధి చెందుతుంది. అనుకున్న పనిని అనుకున్నట్టు పూర్తిచేస్తారు. మీ ప్రణాళికలు ఫలిస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


కన్యా రాశి


ఈ రోజు ఈ రాశివారు వ్యాపారంలో లాభాలు పొందుతారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వారి వారి పనులపై దృష్టిసారించాలి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.


తులా రాశి 


ఈ రోజు పనిలో ఒత్తిడి ఉంటుంది కానీ అనుకున్న పనువు పూర్తిచేస్తారు. కొత్త ప్రణాళికలు అమలుచేస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవితంలో కొత్త రోజులు వస్తాయి. 


వృశ్చిక రాశి


ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉండొచ్చు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. 


Also Read: 2023 మార్చినెల రాశిఫలాలు, అపనిందలు, ఆకస్మిక ప్రమాదాలు - మార్చిలో ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి!


ధనుస్సు రాశి 


ఈ రోజు ఈ రాశివారికి  ఆర్థిక లాభాలుంటాయి. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో పరస్పర సామరస్యం నెలకొంటుంది.ఆఫీసులో పనులు పూర్తి చేయగలుగుతారు.


మకర రాశి


అనవసర వివాదాలకు దూరంగా ఉండి మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొద్దు. 


కుంభ రాశి


ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిడి కూడా పెరుగుతుంది. కార్యాలయంలో పనిభారం పడుతుంది. ఈరోజు తొందరగా అలసిపోతారు, మానసికంగా ఒత్తిడికి గురవుతారు.  


మీన రాశి 


ఈ రోజు ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు పనిని వాయిదా వేయవద్దు. పనులను వాయిదా వేయవద్దు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబంతో కలసి శుభకార్యానికి హాజరవుతారు.