Horoscope Today 30 December 2022: ఈ ఏడాది ఆఖరు ఈ రాశులవారికి సంతోషాన్నిస్తుంది, డిసెంబరు 30 రాశిఫలాలు

Rasi Phalalu Today 30th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Continues below advertisement

Horoscope Today 29th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

Continues below advertisement

మేష రాశి 
ఈ రోజు ఈ రాశివారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. పెరిగిన ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.

వృషభ రాశి 
మా మాటతీరు , పని చేసే విధానం ప్రశంసలు అందుకుంటుంది. కుటుంబ సభ్యులనుంచి మీకు పూర్తిమద్దతు ఉంటుంది. వ్యాపారం బాగాసాగుతుంది. ఉద్యోగులుకు బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మిథున రాశి
ఈ రోజు ఆఫీసులో... మీరు కొత్త వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు మీ పనిని డిస్ట్రబ్ చేస్తారు. ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం ఉత్తమం. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి 
ఈ రాశివారికి ఈ రోజు శుభదినం. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి..ఆరోగ్యం బావుంటుంది. వైవాహిక జీవితంలో టెన్షన్ నుంచి బయటపడతారు. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

Also Read: ఈ నాలుగు లక్షణాలు ఉంటే ఆర్థికంగా ఎప్పటికీ ఎదగలేరు, కొత్త ఏడాదిలో అయినా ఈ మార్పులు చేయండి!

సింహ రాశి
మీ సన్నిహితులు,స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. పనిలో చురుకుగా ఉంటారు. క్లిష్టపరిస్థితుల్లో మీకు మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.

కన్యా రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో లాభాలను పొందుతారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. ఇంటి బాధ్యతలు నిర్వహించడంలో మీరు సక్సెస్ అవుతారు. కొన్ని ప్రణాళికలు సకాలంలో పూర్తిచేస్తే పనిలో పురోగతి ఉంటుంది. 

తులా రాశి 
ఈ రోజు మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఏదైనా పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు..దీనివల్ల కుటుంబం కోసం చేసిన పని వాయిదా పడుతుంది. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. 

వృశ్చిక రాశి 
స్థానం, జీతం లేదా మీ హక్కులు పెరగవచ్చు. క్రొత్త ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది. మీరు కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు. ప్రేమికులతో సంబంధాలు , సన్నిహిత సంబంధాల విషయాలలో పురోగతి ఉంటుంది. మనస్సులో గందరగోళం ఉంటుంది కానీ మీకంతా మంచే జరుగుతుంది

ధనుస్సు రాశి 
ఈ రోజు మీరు ఆర్థిక లాభాలు పొందే దిశగా అడుగేస్తారు. రోజంతా రిఫ్రెష్ గా ఉంటారు. ఆఫీసుకు వెళ్లడం మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. కుటుంబంలోని అందరితో సామరస్యం ఉంటుంది. ఈ రోజు మీకు ఆధ్యాత్మికత వైపు కొంత మొగ్గు ఉంటుంది.

Also Read: కామన్ వచ్చే 10 కలలు ఇవి, వీటిలో వచ్చిన కలను బట్టి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు!

మకర రాశి
ఈ రాశివారికి ఈ రోజు శుభదినం.ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వైవాహిక జీవితంలో ఆహ్లాదకరమైన ఫలితాలు ఉంటాయి.ప్రేమికులకు కొన్ని సమస్యలు తప్పవు.  ఈ రోజు మీరు సుదీర్ఘ ప్రయాణం గురించి ఆలోచిస్తారు. 

కుంభ రాశి
పాత సంబంధాలను బలోపేతం చేయడంలో మీరు విజయం సాధిస్తారు. ఏదైనా అదనపు పనిని చేపట్టడానికి ముందు, మీరు కొన్ని రోజువారీ బాధ్యతలను కూడా నెరవేర్చాలని గుర్తుంచుకోండి. ఇతరులకు సహాయం చేస్తారు. ఆర్థికంగా బావుంటుంది

మీన రాశి
ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. మీరు ఒక కుటుంబ ఫంక్షన్ కు వెళతారు. ఇంట్లో కొన్ని పనుల కారణంగా కార్యాలయ పని ఆలస్యం కావచ్చు, దీని వల్ల మీరు కొంచెం కలత చెందుతారు.

Continues below advertisement