Today Horoscope Telugu - రాశిఫలాలు (26-05-2024)


మేష రాశి
ఈ రోజు నిపుణుల సలహాతో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు. కొంతమంది పాత ఆస్తులను విక్రయించే ఆలోచనలో ఉంటారు. ఈ రోజు సామాజిక హోదా  పెరుగుతుంది. మీ భాగస్వామితో మానసిక బంధం బలంగా ఉంటుంది. 


వృషభ రాశి
ఈ రోజు సాధారణ రోజు అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి జీవితంలో పరిచయాలు పెరుగుతాయి. అతిథుల రాక వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఆర్థిక ప్రణాళికను రూపొందించండి. కార్యాలయంలో మీ పనితీరు మెచ్చుకోలుగా ఉంటుంది. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించండి.  


మిథున రాశి
ఈ రోజు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. ఏదైనా ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకునేముందు కచ్చితంగా నిపుణల సలహాలు తీసుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులకు పనితీరుకి ప్రశంసలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాలి అనుకున్నవారికి ఇదే మంచి సమయం. సామాజిక కార్యక్రమాలపట్ల ఆశక్తి పెరుగుతుంది. ప్రేమజీవితం బావుంటుంది. 


Also Read: ఈ రాశులవారి మనస్తత్వం చిన్నపిల్లల్లా ఉంటుంది!
 
కర్కాటక రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నవారికి మంచి అవకాశాలొస్తాయి. ఆస్తికి సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు విజయం సాధిస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ప్రేమ జీవితం బావుంటుంది.


సింహ రాశి
వృత్తి జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం ఉంది. కార్యాలయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఈ రోజు ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషన పూర్తవుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. 


కన్యా రాశి
ఆర్థిక విషయాలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీరు చేపట్టే పనులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంతో కలసి సెలవులకు ప్లాన్ చేసుకోవచ్చు. మీ కలలు నిజం చేసుకునేందుకు కొత్త వ్యూహాలు రూపొందించండి. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉంటుంది. 


Also Read: వృషభ రాశిలోకి బుధుడు - ఈ రాశులవారికి ఆర్థికంగా అదృష్టమే కానీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు తప్పవు!


తులా రాశి
ఈ రోజు ఈ రాశివారు వ్యక్తిగత , వృత్తి జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు.ఈ రాశి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. మీ లక్ష్యాలపై దృష్టి సారించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. అతిథుల రాకవల్ల ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది


వృశ్చిక రాశి
వృత్తి జీవితంలో పని బాధ్యత పెరుగుతుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీ భాగస్వామితో మానసిక బంధం బలంగా ఉంటుంది. కార్యాలయంలో పురోగతికి లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయి. మీ భావాలను మీ భాగస్వామికి బహిరంగంగా వ్యక్తపరచండి. కుటుంబ జీవితంలో  సమస్యలను తెలివిగా పరిష్కరించుకోండి.  కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించండి.  మీ జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 


ధనుస్సు రాశి
వ్యక్తిగత , వృత్తి జీవితంలో చాలా పెద్ద మార్పులు ఉంటాయి. వినూత్న ఆలోచనలు మంచి ఫలితాలనిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  ఈరోజు మీరు స్నేహితుడికి ఆర్థికంగా సహాయం చేయాల్సి రావొచ్చు. ముఖ్యమైన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. మీ పని సంతోషకరమైన ఫలితాలను ఇస్తుంది. కెరీర్ వృద్ధి కోసం కొత్త మార్గాలను అన్వేషించండి.  


మకర రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. గృహోపకరణాలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు.  వృత్తి జీవితంలో కొంత జాగ్రత్తగా పని చేయవలసి ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకోవచ్చు. కొంతమంది పాత ఆస్తులను అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా డబ్బు పొందుతారు.  


కుంభ రాశి
ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఖర్చులను నియంత్రించుకోండి. కార్యాలయంలో సవాళ్లు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త ఆస్తి లేదా వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. ఒంటరి వ్యక్తులు ఈరోజు ప్రత్యేకంగా ఎవరినైనా కలుస్తారు. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి - 


మీన రాశి 
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వృత్తి జీవితంలో కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి రోజు. ఊహించని ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. మీరు సంపదకు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి.


Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.