మే 24 రాశిఫలాలు
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. కొన్ని పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. కొత్త వ్యాపార ప్రణాళికను రూపొందించడంలో విజయం సాధిస్తారు. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. శత్రువులు కొన్ని సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు అప్రమత్తంగా ఉండాలి.
వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
మీ రోజంతా ఆనందంగా ఉంటారు. మీరు చేసే పని ప్రశంసలు అందుకుంటుంది. మీ ప్రియమైనవారి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఈరోజు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళతారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. దీని వలన మీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు పెరుగుతాయి. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఉంటాయి.
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఈరోజు మీకు సంతోషకరమైన రోజు. సామాజిక సేవలో ఆసక్తిని కనబరుస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కార్యాలయంలోని వ్యక్తులను ఆకట్టుకుంటాయి. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు పెరుగుతాయి. కానీ అదృష్టం మీద ఆధారపడకండి, కష్టపడి పని చేయండి. కుటుంబంతో సమయం గడపవచ్చు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి.
కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు ఈ రోజు మంచిరోజు. మీ ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పు ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. డబ్బు పెట్టుబడి పెట్టడం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయ మార్గం పెరుగుతుంది. మీ ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. సమాజంలో మీ ప్రభావం పెరుగుతుంది, పోటీ పరీక్షలకు సంబంధించి విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
Also Read: ఈ రాశులవారు నిజంచెప్పరు-అబద్ధమాడరు, మీరున్నారా ఇందులో!
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఈ రోజు మీకు మంచి ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా కొన్ని ముఖ్యమైన బాధ్యతలను పొందుతారు. అనుకున్నపనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులు పై అధికారుల మద్దతు పొందుతారు. ఎవరితోనూ వాదించవద్దు. మీ వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ . విశ్వాసం పెరుగుతుంది.
కన్యా రాశి (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఎత్తులు వేస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది.
తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
ఈరోజు మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీరు మీ వ్యాపార వృద్ధికి ప్రణాళికలు వేస్తారు. దీని వల్ల మీరు భవిష్యత్తులో పెద్ద ప్రయోజనం పొందుతారు. స్నేహితులతో మీ సంబంధాలు బాగుంటాయి. మీరు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. తెలివిగా వ్యవహరించండి. సంతోషం, సౌకర్యాలు పెరుగుతాయి
వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్టు ప్రారంభించవచ్చు. అనుకోని ప్రయోజనం పొందుతారు. మీ వ్యాపారం వేగవంతం అవుతుంది. మతపరమైన పనులలో చాలా ఖర్చు చేస్తారు. సమాజంలో మీ ఆదరణ పెరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మీ హోదా పెరుగుతుంది . ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. పనివిషయంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
Also Read: వారఫలాలు (మే 22 నుంచి 28 ): ఈ వారం ఈ రాశులవారు ఆదాయాన్ని మెరుగుపర్చుకునే ప్రయత్నాల్లో ఉంటారు
మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వృత్తిపరంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీ పని ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల మద్దతు లభించదు. మతపరమైన వ్యవహారాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
కుంభ రాశి (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఉద్యోగులు, వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంలో సానుకూల మార్పులు ఉంటాయి. మంచి అనుభూతి చెందుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మంచి కెరీర్ అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచిది.
మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రోజు మీరు మీ ఉద్యోగంలో ఆకస్మిక లాభాన్ని పొందుతారు. మీ కృషికి ప్రశంసలు అందుతాయి. విద్యార్థులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ఏదైనా లావాదేవీని ఆలోచనాత్మకంగా చేయండి. సీనియర్ల సలహాలు తీసుకోవచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది