ఈ రాశులవారు నిజంచెప్పరు-అబద్ధమాడరు, మీరున్నారా ఇందులో!

నిజం-అబద్ధం రెండూ పక్కపక్కనే ఉంటాయి...కొందరు నిజం మాత్రమే మాట్లాడితే మరికొందరు అలవోకగా అబద్ధం చెప్పేస్తారు. కావాలని చెప్పకపోయినా పరిస్థితులు అలా మార్చేస్తాయట...మీ రాశి ఉందా ఇందులో....

Continues below advertisement

Zodiac Signs: కొందరు కొన్ని విషయాలు చెప్పినప్పుడు నిజం చెప్పరాబాబూ అంటారు సరదాగా. అంటే వాళ్లు అబద్ధం చెబుతున్నారా అంటే కాదు.. పోనీ నిజం చెబుతున్నారా అంటే అదీ కాదు. ఏంటి కన్ఫ్యూజన్లో ఉన్నారా. కొందరు సరదా కోసం అబద్ధం చెబుతారు. మరి కొందరు అవసరం కోసం అబద్ధం చెబుతారు. ఇంకొందరు సమస్యను తగ్గించేందుకు అబద్ధమాడతారు. కారణం ఏదైనా అబద్ధాలు మాత్రం చెబుతారు. ఇదికూడా మీ రాశి ఆధారంగానే ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మీ ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి...

Continues below advertisement

మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

మిథున రాశివారికి రెండు నాలుకలుంటాయి. వీళ్లు అలఓకగా అబద్ధం చెప్పేస్తారు. కొన్ని సందర్భాలలో పాజిటివ్ ని కూడా నెగిటివ్ చేయగలుగుతారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మాట మార్చేస్తారు. ఎవరు ఎంత చెప్పినా వీరు చేయాలనుకున్నదే చేస్తారు. అయితే అన్ని సందర్భాల్లోనూ వీరి స్వార్థంకోసమే అబద్ధం చెబుతారు అనుకుంటే పొరపాటే...వేరేవారికి మంచి చేయడానికి, కొన్ని వివాదాస్పద పరిస్థితులను కూల్ చేసేందుకు కూడా అబద్ధాలు చెబుతారు. 

తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

ఈ రాశివారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తటస్థంగా ఉండాలనుకుంటారు. అంటే అటు మాట్లాడరు, ఇటు మాట్లాడరు. నిజం చెప్పరు  అలాగని అబద్ధం కూడా చెప్పరు. వీరికి గొడవలు ఎక్కువగా ఇష్టం ఉండదు. అందుకే అటు ఇటూ మాట్లాడకుండా ఉండిపోతారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి చేయిదాటించి అనుకున్నప్పుడు అబద్ధం చెప్పేందుకు వెనుకాడరు. 

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

రహస్యాలను దాచడంలో ఈ రాశి వారిని మించినవారు లేరు. ఎంత పెద్ద విషయం అయినా బయటకు కక్కరు..లోపలే దాచేసుకుంటారు.  ఎదుటి వారి మనసులో మాటని మాత్రం బయటపెట్టించేందుకు తెగ ప్రయత్నిస్తారు. సిట్యుయేషన్ పీక్స్ కి వెళ్లినప్పుడు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు, తమని తాము సమర్ధించుకునేందుకు అస్సలు వెనుకాడరు. ఆ సమయంలో నిజాలను కూడా అబద్ధాలుగా మార్చేయడంలో వీరు దిట్ట. అందుకోసం ఎదుటివారి అభిప్రాయాలను తారుమారు చేయడంలో సక్సెస్ అవుతారు. 

ధనుస్సు రాశి  (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రాశివారు అబద్ధాలను కూడా అందంగా చెప్పేయగల నేర్పు కలిగిఉంటారట. అబద్ధం ఎంతబాగా చెబుతారంటే అది నిజం అని నమ్మేలా.. అబద్ధం అని అస్సలు అనుమానం రాకుండా ఉండేలా ఉంటుందట. అందరి ముందూ తమని తాము గొప్పగా చూపించుకునేందుకు హాయిగా అబద్దం చెప్పేస్తారట.

Also Read: ఈ రాశులవారి మనసులో ఏమున్నా ఠక్కున బయపెట్టేస్తారు, మీరున్నారా ఇందులో!
 

మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశివారు చాలా సున్నితంగా కనిపిస్తారు కానీ మహా ముదుర్లు అంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. వాస్తవప్రపంచాన్ని తట్టుకునే శక్తి ఈ రాశివారికి తక్కువట. అందుకే దాన్నుంచి తప్పించుకునేందుకు అవాస్తవ ప్రపంచంలో అడుగుపెడతారు. వీరినోటినుంచి వచ్చే మాటల్లో నిజాలు కన్నా అబద్ధాలే ఎక్కువగా ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

Also Read: మే 23 రాశిఫలాలు, ఈ రాశివారు జీవితానికి సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు

మరి మిగిలిన రాశులవారంతా సత్యహరిశ్చంద్రులా అని అడుగుతారేమో...వందశాతం అవును అని చెప్పలేం కానీ పైన పేర్కొన్న రాశులవారితో పోలిస్తే మిగిలిన వారు (మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, కుంభ) నిజాయిగా వ్యవహరిస్తారట. వీళ్లు అబద్ధాలు చెప్పరు, అబద్ధాలు చెప్పేవారిని అస్సలు ప్రోత్సహించరట. 

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Continues below advertisement