24th January 2023 Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీకు చాలా ఫలవంతమైన రోజు. కుటుంబంలోని వ్యక్తుల నమ్మకాన్ని గెలుచుకోగలుగుతారు. మీకు కొన్ని కెరీర్ సమస్యలు ఉంటే అవి సమసిపోతాయి. ఉద్యోగుల పాత తప్పలు కొన్ని బయటపడతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు..మోసపోతారు. కుటుంబంలో ఒకరి వివాహానికి ఏవైనా అడ్డంకులు ఎదురైతే అవి తొలగిపోతాయి.
వృషభ రాశి
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు. అనుకున్న పనులు త్వరగా పూర్తిచేయగలుగుతారు. అప్పిచ్చిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది. మీ బాధ్యతలను విస్మరించవద్దు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదింపులు జరపవచ్చు.
మిథున రాశి
ఈ రోజు మీరు శుభవార్త వింటారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో చేరడం ద్వారా మంచి పేరు సంపాదిస్తారు కానీ ఏ తప్పు పనికి ఓకే చెప్పకండి..ఫ్యూచర్లో పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. వివిధ రంగాల్లో మీ విజయానికి కొన్ని కొత్త మార్గాలు ఉంటా. ఆద్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి కలిగి ఉంటారు. అందరితో కలసి మెలసి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు.
Also Read: ఈ రాశివారికి మానసిక ఒత్తిడి, ఆ రాశివారికి ఆర్థిక సమస్యలు - జనవరి 23 నుంచి 29 వారఫలాలు
కర్కాటక రాశి
అవసరమైన పనులను వాయిదా వేయొద్దు. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. ఈరోజు మీరు ఆకస్మిక లాభాలతో సంతోషంగా ఉంటారు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. నెట్వర్కింగ్ రంగంతో సంబంధం ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అందుతాయి. సంతానం కారణంగా కొంత నిరాశతో ఉంటారు. వ్యాపారు కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు.
సింహ రాశి
ఈ రోజు ఆర్థికంగా ఉత్తమమైన రోజు. మీరు టీమ్ వర్క్ ద్వారా పనిచేసే అవకాశం లభిస్తుంది..తద్వారా కష్టమైన పనిని సకాలంలో పూర్తి చేయగలరు. జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో వివాదం పెట్టుకోవద్దు..ఆమెను గందరగోళానికి గురిచేసేలా మాట్లాడొద్దు. వ్యాయామాన్ని దినచర్యలోభాగంగా ఫిక్స్ చేసుకోకుంటే భవిష్యత్ లో అనారోగ్య సమస్యలు తప్పవు.
కన్యా రాశి
ఈరోజు వ్యాపారులకు అంత మంచి రోజు కాదు... మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి..మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు. మీరు చాలా కష్టపడితేనే విజయం సాధించగలరు. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడం మానుకోవాలి. ఉద్యోగులకు శుభసమయం. మీలో స్థిరత్వం ఉంటుంది.
Also Read: ఈ వారం ఈ నాలుగు రాశులవారి జీవితం ఆనందమయం,జనవరి 23 నుంచి 29 రాశిఫలాలు
తులా రాశి
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఏదైనా వ్యాపార సంబంధిత పనుల కోసం డబ్బు అప్పు చేయవలసి వస్తే, చాలా జాగ్రత్తగా తీసుకోండి, లేకపోతే సమస్య ఉండవచ్చు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. మీ స్నేహితులు , సన్నిహితులతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. పని వెతుక్కుంటూ తిరిగేవారికి కొన్ని శుభవార్తలు వింటారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ అభిప్రాయాలను పిల్లలపై రుద్దితే బాధపడక తప్పదు. కొత్త వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. సీనియర్ సభ్యులతో సంభాషించేటప్పుడు మృదువైన స్వభావం కలిగి ఉండాలి. కుటుంబ విషయాలను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకండి, లేకపోతే సమస్యలు పెరుగుతాయి. మీరు పాత తప్పును కప్పిపుచ్చుకోగలుగుతారు. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లతారు.
ధనుస్సు రాశి
సామాజిక రంగాల్లో పనిచేసే వారికి కొన్ని కొత్త విజయాలు అందుతాయి. మీ పనులు సకాలంలో పూర్తి చేయడానికి మీ సోమరితనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సంబంధాల్లో కొంత విభేదాలు తలెత్తితే చర్చల ద్వారా కూడా అధిగమించగలుగుతారు. మీరు ఏ పనిలోనైనా రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు పోదోన్నతి కారణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి మారవలసి ఉంటుంది.
మకర రాశి
ఈ రోజు మీకు సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది. మీ సౌకర్యాలకు సంబంధించిన కొన్ని వస్తువులను షాపింగ్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు చేస్తారు. మీ స్నేహితుల మాటలు విని ఆలోచించకుండా పెట్టుబడి పథకాల్లో డబ్బులు పెట్టొద్దు..నష్టపోతారు.
కుంభ రాశి
ఈ రోజు మీరు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయాన్ని పొందే రోజు. మీరు మీ పనిని బాధ్యతాయుతంగా చేయాలి, లేకపోతే సమస్య ఉండవచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు తమ ప్రణాళికలను తిరిగి ప్రారంభిస్తారు. పిల్లల ఉద్యోగానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. ఈ రోజు మీరు సృజనాత్మక పనిలో బలాన్ని పొందుతారు. విద్యలో సమస్యల వల్ల విద్యార్థులు కొంత అసౌకర్యానికి గురవుతారు.
మీన రాశి
ఖర్చుల విషయంలో ఈ రోజు మీరు చాలా ఆలోచించాల్సి ఉంటుంది. చేతిలో ఉన్నప్పుడు ఖర్చులు పెంచితే ఆ తర్వాత ఇబ్బంది పడక తప్పదు. వ్యాపారుల పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. ఇంటా బయటా వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు.ఈ రోజు రంగంలో మీ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది.అయితే తొందరపడి ఏ పనైనా చేయకూడదు.