Today Horoscope Telugu - రాశిఫలాలు (24-05-2024)


మేష రాశి


ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజుగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. మీ ఆలోచనలను ఇతరులపై రుద్దకండి. అవసరం లేకుంటే ఈరోజు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. తోబుట్టువుల విషయంలో కొన్ని ఆందోళనలు ఉండవచ్చు


వృషభ రాశి


ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త మార్పులు గమనిస్తారు. ఉన్నతాధికారుల నుంచి మీకు సహకారం అందుతుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనతో సంతోషంగా ఉంటారు. మీ బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించేందుకు కృషి చేయాలి. 


Also Read: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం, రెండో చంద్రగ్రహణం ఎప్పుడొచ్చిందో తెలుసా!


మిథున రాశి


ఈరోజు అప్పులు చెల్లించేస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కార్యాలయ పనుల్లో బిజీగా ఉంటారు.  ప్రతికూల ధోరణులు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి. పిల్లల ప్రవర్తనతో సంతోషిస్తారు. ముక్కు, చెవులు లేదా గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది 


కర్కాటక రాశి
నూతన స్నేహితుల ఏర్పడతారు. నరాలకు సంబంధించిన ఇబ్బందులుంటాయి. ఎక్కువసేపు కూర్చోవాల్సిన పనులకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు విజయం సాధిస్తారు. 


సింహ రాశి


పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు చాలా మంచిది. చెడు విషయాలపై అతిగా స్పందించవద్దు. వాతావరణంలో మార్పుల కారణంగా ఆరోగ్యంలో మార్పులొస్తాయి. పాత స్నేహితులను కలుస్తారు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. 


Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!


కన్యా రాశి


ఈ రాశివారు కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిరోజు.  సైబర్ మోసాల బారిన పడవచ్చు.  అందర్నీ అతిగా నమ్మి మోసపోయే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.  ఆహారం విషయంలో సమయపాలన అవసరం....


తులా రాశి


తులా రాశివారు ధనలాభం పొందే అవకాశం ఉంది. మీ ప్రవర్తనా విధానం అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. విదేశాల నుంచి ఉద్యోగ ఆఫర్లు పొందుతారు. కెరీర్లో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. 


వృశ్చిక రాశి 


న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. వైద్య వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. సబార్డినేట్ ఉద్యోగులపై నిఘా ఉంచండి. 


ధనుస్సు రాశి


ఈ రోజు మీరు కొంత అసంతృప్తితో ఉంటారు. కాస్త ఓపికగా వ్యవహరించాలి. ఓపికగా పరిస్థితులను గమనించాలి. నూతన పెట్టుబడులు పెట్టేముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. 


మకర రాశి


ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు.వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. అవసరాలకు అనుగుణంగా మాత్రమే ఖర్చు చేయండి. ఆస్తి వివాదాల్లో ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. అవివాహిత వ్యక్తుల వివాహానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. 


కుంభ రాశి


నిరుద్యోగులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఇంటర్యూలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. 


మీన రాశి


రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.