Today Horoscope Telugu - రాశిఫలాలు (22-05-2024)


మేష రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సవాళ్లు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటింది. చేపట్టిన పనులు కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేస్తారు. ఆస్తులు అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి.


వృషభ రాశి 
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి.కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజు. పెట్టుబడి నిర్ణయాలను తెలివిగా తీసుకోండి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కొత్త ఆస్తి లేదా వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. 


Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!


మిథున రాశి
ఈ రోజు మీరు ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు. వృత్తి జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. మీ ప్రియమైనవారిని ప్రశంసించడం ద్వారా మానసిక బంధం బలపడుతుంది. 


కర్కాటక రాశి
వ్యాపారంలో లాభం ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఉంటుంది.  ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీ నెట్ వర్క్ పెరుగుతుంది. కొత్తవ్యక్తులతో సమావేశం అవుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. 
 
సింహ రాశి
ఈ రోజు సింహరాశి వారు ప్రతి రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. అంకితభావంతో చేసే పని అనుకున్నదానికంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది.  కొందరికి వారసత్వంగా వచ్చిన ఆస్తిని బాగు చేసుకోవచ్చు. ఈరోజు సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.   ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  దూరప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. 


కన్యా రాశి
ఈ రోజు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. వృత్తి జీవితంలో అదృష్టం కలిసొస్తుంది. కార్యాలయంలో  సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. కొత్త ప్రాజెక్టు బాధ్యతలు అందుకుంటారు.  కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ఈరోజు కొత్త ప్రణాళికను రూపొందించండి. మీ బడ్జెట్‌పై శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  


Also Read: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే!


తులా రాశి 
కెరీర్‌లో పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. కార్యాలయంలో ఒత్తిడిని ఇంటికి తీసుకరావొద్దు.  ఆర్థిక విషయాలలో తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. పరిశోధన చేయకుండా పెట్టుబడి పెట్టవద్దు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలున్నాయి. మీ భావాలను మీ భాగస్వామికి బహిరంగంగా తెలియజేయండి. ఇది సంబంధాలపై ప్రేమ , విశ్వాసాన్ని పెంచుతుంది. 


వృశ్చిక రాశి
ఈ రోజు మీరు పాత పెట్టుబడుల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు కెరీర్‌లో ఆశించిన విజయాన్ని పొందుతారు. బంధువులతో కలిసి ఏదైనా కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి కష్టపడతారు. నూతన ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. ఫిట్ నెస్ పై శ్రద్ధ వహించండి. 
 
ధనస్సు రాశి
మీ జీవితంలో చాలా సానుకూల మార్పులు ఉంటాయి. వృత్తి జీవితంలో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది.  సంబంధాలలో ప్రేమ  నమ్మకం పెరుగుతుంది. పరిస్థితికి తగ్గట్టు ప్రయత్నించండి.  కెరీర్ వృద్ధికి కొత్త అవకాశాలపై నిఘా ఉంచండి. కార్యాలయంలో కొత్త   బాధ్యతలు స్వీకరిస్తారు. 


మకర రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యాలయంలో పనితీరు ఉన్నతోద్యోగులను ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాలు ఉన్నట్టైతే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. కుటుంబంతో కలసి విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. ప్రేమ, వైవాహిక బంధంలో సంతోషం ఉంటుంది. 


కుంభ రాశి
కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి రోజు. ధన లాభం ఉంటుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు పొందుతారు. కెరీర్లో కొత్త విజయాలు సాధిస్తారు. సంపద, ఆస్తులు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు జీవితంలోని ప్రతి రంగంలో ఆశించిన విజయాన్ని పొందుతారు.  కుటుంబ జీవితంలో  శాంతి ఉంటుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి.   


మీన రాశి
వృత్తి జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీ పని పట్ల అజాగ్రత్తగా ఉండకండి. కెరీర్ వృద్ధికి కొత్త అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోండి.  సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి జీవితంలో ముఖ్యమైన విజయాలు సాధిస్తారు.  ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.  


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.