Horoscope Today 2023 July 30th 


మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. విద్యార్థులకు చదువులో ఆటంకాలుంటాయి. ఏదో విషయంలో మనసంతా ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. వ్యాపారం బాగానే సాగుతుంది. పాత స్నేహితులను మళ్లీ కలుస్తారు. 


వృషభ రాశి
ఈ రాశివారికి ఈరోజు మనశ్శాంతి ఉంటుంది. అయితే కోపానికి దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యా కార్యాల్లో విజయం ఉంటుంది.  మేధోపరమైన పనిలో గౌరవం పొందుతారు. వాక్కు ప్రభావం పెరుగుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఎవ్వరిపైనా మాటతూలొద్దు. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. వాహన సౌఖ్యం ఉంటుంది. 


మిథున రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ మనసు చంచలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. స్థానచలనం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవన పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. తలపెట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. విహార యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపు ఉండొచ్చు.


Also Read: దేశంలో ముఖ్యమైన ఈ 10 ఆలయాల్లో ప్రసాదం చాలా ప్రత్యేకం!


కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. మీకు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వ్యాపారం పట్ల అవగాహన మరింత ఉండాలి..ఎంత కష్టపడినా ఆశించిన స్థాయిలో లాభం ఉండదు. తోబుట్టువులతో విభేదాల పెరిగే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.


సింహ రాశి
ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగ ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమై ఉంటారు. ప్రణాళికేతర ఖర్చులు అధికంగా ఉంటాయి. స్నేహితుల మద్దతు లభిస్తుంది. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.


కన్యా రాశి
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది ఖర్చులు పెరుగుతాయి. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. మేధోపరమైన పని నుంచి డబ్బు పొందవచ్చు. ఈ రాశి ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు లేకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి.


Also Read: రామాయణంతో ముడిపడిన ప్రదేశాలు శ్రీలంకలో ఎన్నో ఉన్నాయి!


తులా రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఒడిదొడుకులు ఉంటాయి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్నేహితుల నుంచి సహకారం ఉండొచ్చు.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మేధోపరమైన రచనల ద్వారా గౌరవం పొందుతారు. ప్రారంభించిన పనులకు  జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. మతపరమైన స్థలాన్ని సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటారు.  పాలక యంత్రాంగం నుంచి సహాయం అందుతుంది.


వృశ్చిక రాశి
ఈ రాశి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగులకు ఖర్చులు పెరుగుతాయి కానీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. మాటలో సౌమ్యత ఉంటుంది. కోపం, క్షణిక ఆవేశానికి దూరంగా ఉండడం మంచిది. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది. దుస్తుల కోసం ఖర్చు చేస్తారు.


ధనుస్సు రాశి
ఈ రాశివారు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందుతారు కానీ కుటుంబానికి దూరంగా వెళ్లాల్సి రావొచ్చు.  ఉద్యోగులు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. విద్యార్థులకు శుభసమయం.


మకర రాశి
ఈ రాశివారు ఈరోజు మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ స్నేహితులు మీకు అండగా ఉంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. విద్యపై ప్రత్యేక శ్రద్ద వహించండి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత పదవిని అందుకోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. కార్యాలయంలో కొన్ని సమస్యలు ఉంటాయి కానీ వాటిని అధిగమిస్తారు. ధార్మిక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు


కుంభ రాశి
ఈ రోజంతా ప్రశాంతంగా ఉంటారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు తలపెట్టే పనులకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఏదైనా ఆస్తి నుంచి ఆదాయం పెరుగుతుంది. స్నేహితుని సహకారంతో మీరు పురోగతి చెందుతారు.  ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఖర్చులు అధికమవుతాయి.


మీన రాశి
ఈ రాశివారికి చదువులపై ఆసక్తి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే ఛాన్సుంది. కుటుంబంలో-కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ గౌరవం పెరుగుతుంది. మితిమీరిన కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. స్నేహితుని సహాయంతో నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. సంపాదనలో మెరుగుదల ఉంటుంది.


గమనిక: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.