Horoscope Today 04 September 2023

మేష రాశిమేష రాశి వారికి ఈ రోజు  మంచిరోజు. భవిష్యత్ కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ కెరీర్ ఉన్నతికి సంబంధించిన సమచారం వింటారు. కుటుంబ వాతావరణం బావుంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.

వృషభ రాశిఈ రాశి వారికి ఈ రోజు ఒత్తిడితో కూడి ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు రావచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు ఓ బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. 

మిథున రాశిఈ రాశికి చెందిన వ్యాపారులు ఈ రోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల చర్యల వల్ల సమస్యలు పెరుగుతాయి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఓ స్నేహితుడి ద్వారా మీరు గుడ్ న్యూస్ వింటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. 

Also Read: ఈ వారం ఈ రాశులవారికి లక్కు కలిసొస్తుంది - సెప్టెంబరు 4 నుంచి 10 వారఫలాలు

కర్కాటక రాశిఈ రాశివారు ప్రవర్తనలో మార్పులును గుర్తిస్తారు.  కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.  కుటుంబ సభ్యులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఏదైనా తప్పుచేస్తే ఈ రోజు మీరు రియలైజ్ అవుతారు. ఆర్థిక లాభాలుంటాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి.

సింహ రాశిఈ రాశివారు ఎవరైనా ఏదైనా చెప్పిన వెంటనే పాటించేయడం సరికాదు. ప్రయాణంలో బంధువులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో వ్యాపారం గురించి చర్చిస్తారు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్నాకే కొత్త ప్రయత్నాలు ప్రారంభించండి.  రాజకీయ చర్చల్లో పాల్గొంటారు.

కన్యా రాశిఈ రోజు ఈ రాశివారికి ఆదాయం బాగానే ఉంటుంది..అయితే అవసరానికి మించి ఖర్చు చేయకండి. విద్యార్థులు లాభపడతారు. స్నేహితుల భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగులు పనికి తగిన గుర్తింపు పొందుతారు.

తులా రాశితులా రాశివారి జీవితంలో సంతోషం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. వైవాహిక జీవితానికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. అదృష్టం కలిసొస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి.

Also Read: సెప్టెంబరు నెల ఈ రాశులవారికి అదృష్టాన్నిస్తుంది, ఆర్థికంగా కలిసొస్తుంది

వృశ్చిక రాశి ఈ రాశివారు ఈ రోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. న్యాయపరమైన వ్యవహారాల్లో చిక్కుకున్నవారికి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. ఏదో తెలియని భయంతో బాధపడతారు. ఆరోగ్యాన్ని అస్సలు అశ్రద్ధ చేయవద్దు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. 

ధనుస్సు రాశిఈ రోజు ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. శత్రువులు యాక్టివ్ గా ఉన్నారు మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి. రహస్య విషయాలను బయపెట్టడం సరికాదు. మీ ప్రణాళికల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ సున్నిత స్వభావాన్ని ఆసరాగా చేసుకునేవారున్నారు జాగ్రత్త. వృత్తి గురించి ఆందోళన ఉంటుంది.

మకర రాశి ఈ రోజు మకర రాశి వారికి మిశ్రమ రోజుగా ఉంటుంది. విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కి సంబంధించిన వార్తలు అందుతాయి. ఎవరితోనైనా వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వివాదానికి దూరంగా ఉండాలి.

Also Read: పుట్టకముందే శత్రువు సిద్ధం, అడుగుకో కష్టం - కృష్ణుడిని మించి సవాళ్లు ఎదుర్కొన్నదెవరు!

కుంభ రాశి కుంభరాశి వారి జీవితంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుతాయి. కెరీర్‌కు సంబంధించి శుభవార్త వింటారు. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది

మీన రాశిఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. సన్నిహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ రహస్య విషయాలు ఎవరికీ చెప్పకపోవడమే మంచిది.  మీపై పని ఒత్తిడి పెరుగుతుంది. తప్పుడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.