Daily Horoscope Predictions in Telugu

మేష రాశి 

ఈ రోజు ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. కొత్త ఆదాయ వనరులు వెతుక్కునే పనిలో పడతారు.  వృషభ రాశి 

మీరు ఈరోజు మానసికంగా ఇబ్బంది పడతారు. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి. ఇంట్లో, కార్యాలయంలో మీ బాధ్యతలు మర్చిపోవద్దు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడి. ఈ రోజు తగిన విశ్రాంతి అవసరం. 

మిథున రాశి

ఈ రోజు పని ఒత్తిడి పెరిగినప్పటికీ  అధిగమిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మంచి ఆదాయం పొందుతారు.  రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారు. భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉండొచ్చు. 

Also Read: కల్కి 2898 AD లో దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ పురాణాల్లో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. పార్ట్ 2 లో కీలక రోల్ ఇది!

కర్కాటక రాశి

ఈ రోజు మీరు అనుకున్నపనులున్నీ అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారంలో భాగస్వాములపై నమ్మకం ఉంచండి. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. మీ మనోబలం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా ఉంటుంది. 

సింహ రాశి

ఈ రోజు వ్యాపార ఒప్పందాలు చేసుకోవద్దు. వ్యాపారంలో ప్రత్యర్థుల వల్ల నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. వ్యక్తిగత సంబంధాల విషయంలో అహం ప్రదర్శించవద్దు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.

కన్యా రాశి

నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మంచిరోజు కాదు. అనవసర చర్చలు, వివాదాలకు దూరంగా ఉండండి. వివేకం , విచక్షణతో పని చేయడం ద్వారా మీరు ప్రయోజనాలను పొందుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సామాజిక కార్యకలాపాలు పెరుగుతాయి. కార్యాలయంలో బాధ్యతల ఒత్తిడి పెరుగుతుంది.

తులా రాశి

ఈ రోజు పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. ఆర్థిక సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఈ రోజు  మంచిరోజు. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఇతరుల ఒత్తిడికి తలొగ్గి పని చేయకండి.

వృశ్చిక రాశి 

ఈ రోజు అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఆలోచనలు సానుకూలంగా ఉండాలి. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆశించిన విధంగా ఫలితాలు రాకపోతే మీరు నిరుత్సాహానికి గురవుతారు.

Also Read: మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుంది..ఎలా వెళ్లాలి..అక్కడ చూసేందుకు ఏమున్నాయ్?

ధనస్సు రాశి

ఈ రోజు ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.  అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. కొత్తగా ప్రారంభించే కార్యక్రమాలకు సంబంధించి కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  మకర రాశి

ఈ రోజు మీరు ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం కలిగి ఉంటారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పిల్లలకు సంబంధించిన విషయంలో ఆందోళన చెందుతారు. మీ లక్ష్యాల విషయంలో వెనక్కుతగ్గొద్దు..

Also Read: మహాభారత విషాద వీరుడు సూర్య పుత్ర కర్ణుడిని ముంచేసిన మూడు శాపాలు ఇవే!

కుంభ రాశి 

ఈ రాశివారు ప్రమోషన్ కి సంబంధించిన అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సంతోషానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామి నుంచి బహుమతి అందుకుంటారు. ఆరోగ్యం , ఆదాయం బావుంటుంది. 

మీన రాశి

కొన్ని రోజులుగా మిమ్మల్ని ఆవహించిన అశాంతి తొలగిపోతుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులుంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.  

ALSO READ: ఈ రాశులవారు ఒంటరితనాన్ని సౌకర్యవంతంగా ఫీలవుతారు..ఇందులో మీరున్నారా!

Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.