జులై 9 శనివారం రాశిఫలాలు (Horoscope 09-07-2022)  


మేషం
పని వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగం గురించి ఆందోళన చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ రోజు మళ్లీ ప్రారంభమవుతాయి. దిగుమతి-ఎగుమతులకు సంబంధించిన వ్యాపారంలో లాభం ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. శత్రువులు ఆధిపత్యం చెలాయిస్తారు. 


వృషభం
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలు మధురంగా ​​ఉంటాయి.పరీక్షకు సిద్ధమవుతున్న యువత కెరీర్ సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు.


మిథునం
ఈ రోజు మంచి రోజు అవుతుంది. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు.  వాహనాన్ని నెమ్మదిగా నడపండి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు. ఆగిపోయిన పని సులభంగా పూర్తవుతుంది. చిన్న విషయానికి కోపం తెచ్చుకోవద్దు. మీరు స్నేహితుల నుంచి మంచి సలహా పొందుతారు.


Also Read: జులై 9 శనివారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శని స్తోత్రం


కర్కాటకం
వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. స్నేహితులు మీ సహాయాన్ని ఆశిస్తారు. పై అధికారుల నుంచి ప్రయోజనం పొందుతారు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. మీ సంపద పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.


సింహం
మీ నైపుణ్యం మరింత పెరుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి మంచి సమయం ఇది. ఈ రోజు మీరు ఏకాంతాన్ని ఇష్టపడతారు. కుటుంబ సభ్యులతో అత్యవసర విషయాలను చర్చిస్తారు. రోజంతా ఆనందంగా ఉంటారు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అప్పులు తీసుకోవద్దు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.


కన్యా
ఎవరితోనూ అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దు. శ్రమకు తగిన ఫలితాలు రావడంలో జాప్యం జరుగుతుంది. బ్యాంకింగ్‌కు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉంటుంది. మీరు కుటుంబంతో సమయం గడుపుతారు. ప్రేమికుల మధ్య విభేదాలు రావొచ్చు. దంపతులు సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. 


Also Read: జులై 10 తొలి ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ఎందుకంటారు!


తులా 
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. గత పెట్టుబడుల నుంచి లాభం ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకం వ్యవహారంలో లాభపడతారు. ఓ పెద్ద సమస్యకు పరిష్కారం లభించినందుకు సంతోషిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు సులభంగా పరిష్కారం అవుతాయి. రిస్క్ తీసుకోవద్దు.కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించండి.


వృశ్చికం
ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. ఆందోళన చెందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను వెంటనే నమ్మవద్దు. తప్పనిసరి అయితే కానీ ప్రయాణం చేయకపోవడమే మంచిది. విదేశాల నుంచి మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ప్రేమికులకు అద్భుతంగా ఉంటుంది. 


ధనుస్సు 
మీరు తెలియని వ్యక్తి నుంచి సహాయం పొందే అవకాశం ఉంది. ఈ రోజంతా బద్దకంగా ఉంటుంది.ఏ పనీ చేయాలని అనిపించదు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారంలో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. బంధువుల కారణంగా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


మకరం
రోజు ఆరంభం చాలా బావుంటుంది. ఆర్థికంగా లాభపడతారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. కార్యాలయంలో లాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సీనియర్ అధికారులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటారు. పిల్లల విజయాల పట్ల ఉత్సాహంగా ఉంటారు.  ఖర్చులు పెరుగుతాయి.


Also Read: బక్రీద్ రోజు మూగజీవాలను ఎందుకు బలిస్తారు, బక్రీద్ పండుగలో ఆంతర్యం ఏంటి!


కుంభం
ఈ రోజు చాలా క్రమశిక్షణతో కూడిన రోజు అవుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. పాత మిత్రులను కలుస్తారు.  కార్యాలయంలో కొన్ని ఇబ్బందులుంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. రాజకీయ నాయకులు లాభపడతారు.


మీనం
రిస్క్ తీసుకోవద్దు. డ్రైవింగ్‌లో ఇబ్బంది ఉండొచ్చు. చట్టపరమైన వివాదాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంటారు. వ్యాపార పరిస్థితులు బావుంటాయి. ఎలక్ట్రికల్ పరికరాలను జాగ్రత్తగా వాడండి. రహస్య విషయాలను అధ్యయనం చేయగలరు. రోజువారీ పనులను పూర్తి చేయడంలో అలసత్వం వహించవద్దు.


Also Read: గోరింట ఆషాడమాసంలోనే ఎందుకంత ప్రత్యేకం, దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా!