Daily Horoscope for 11th October 2024 


మేష రాశి


ఈ రోజు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. పనికిరాని కార్యకలాపాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. మీ సలహాలు అందరకీ ఉపయోగపడతాయి.


వృషభ రాశి


ఈ రోజు కష్టపడి పని చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి రోజు. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.  కళా రంగానికి సంబంధించిన వ్యక్తులు వృత్తి , ఉద్యోగాలలో విజయం సాధిస్తారు.
 
మిథున రాశి


వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ అభిప్రాయాలను ఎవరిపైనా రుద్దొద్దు. సహనం ,  సంయమనం కారణంగా విజయం పొందుతారు. వ్యాపారానికి సంబంధించి పెద్ద ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి.  


Also Read: మీ బంధు మిత్రులకు దసరా శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!


కర్కాటక రాశి


కార్యాలయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.  ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని చూపించగలుగుతారు. మంచి పనుల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోనివ్వకండి. వైవాహిక జీవితంలో ప్రేమ భావాలు పెరుగుతాయి. 


సింహ రాశి


ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. విద్యార్థులు చదువులో కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తారు. కెరీర్ రంగంలో లాభాలు ఉంటాయి. మీరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేముందు వాటి గురించి ఎంక్వైరీ చేయడం మంచిది. బంధువులతో మీ ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలి.


కన్యా రాశి


రోజు మంచి ప్రారంభం అవుతుంది. మీరు రాజకీయ కార్యకలాపాలపై ఆసక్తి  కలిగి ఉంటారు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోండి. మీరు మీ భావాల గురించి స్నేహితుడితో మాట్లాడవచ్చు. మారుతున్న వాతావరణం శారీరక అలసటను కలిగిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది


తులా రాశి


తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోవచ్చు. దీని వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ కష్టానికి పూర్తి ఫలితాలు లభించవు. మీరు గతంలో సహాయం చేసినవారినుంచి తిరిగి సహాయం పొందలేరు. 


Also Read: రావణుడు మంచివాడా చెడ్డవాడా - రావణ దహన వేడుకల వెనుకున్న సందేశం ఏంటి!


వృశ్చిక రాశి


వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. కెరీర్‌కు సంబంధించి శుభవార్తలు అందే అవకాశం ఉంది. సంఘంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు.


ధనస్సు రాశి


ఉద్యోగులు కార్యాలయంలో పనివిషయంలో నిర్లక్ష్యం వద్దు. అధిక ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది.  రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందగలరు. మీ జీవిత భాగస్వామిపై నమ్మకాన్ని కాపాడుకోండి. 


మకర రాశి


మిమ్మల్ని చూసి అసూయ చెందేవారి సంఖ్య పెరుగుతుంది. ఆగ్రహంతో వ్యవహరించవద్దు. కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది జాగ్రత్తపడండి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వాహనాన్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 


Also Read: జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారా..అయితే ఉపశమనం కోసం ఈ స్తోత్రం పఠించండి!


కుంభ రాశి


పెద్దల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది. మనసులో ఏదో అశాంతి బావన వెంటాడుతుంది. వృత్తి ఉద్యోగాలలో సాధారణ ఫలితాలు పొందుతారు. 


మీన రాశి


కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల నుంచి అభినందనలు అందుకుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ముఖ్యమైన వ్యక్తులతో మీ పరిచయాలు అభివృద్ధి చెందుతాయి.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.