Year 2026 Baba Vanga Predictions: 2025 ముగుస్తోంది..కొత్త సంవత్సరం 2026ని స్వాగతించేందుకు అంతా సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సరం దేశానికి- ప్రపంచానికి ఎలా ఉంటుందో, రాబోయే సంవత్సరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. భవిష్యత్ వక్తలు చేసిన జోస్యాలను పరిశీలిస్తుంటారు. బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ భవిష్యత్ వక్త బాబా వాంగా (Baba Vanga) జోస్యాలు చాలా చర్చనీయాంశంగా ఉంటాయి. బాబా వాంగా చేసిన అనేక జోస్యాలు నిజమయ్యాయి. 2026 గురించి బాబా వాంగా చేసిన జోస్యం ప్రజలను భయపెడుతోంది.
2026లో బాబా వాంగా ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచ సంఘర్షణ, వాతావరణ మార్పు, గ్రహాంతరవాసులు, AI (AI) సాంకేతికతలో మార్పు వంటి అనేక జోస్యాలు చేశారు. అయితే ఆర్థిక సంక్షోభం గురించి బాబా వాంగా చేసిన జోస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను భయపెడుతోంది. జోస్యం ప్రకారం, 2026లో ప్రపంచంలో ఒక సంక్షోభం రావచ్చు, దీని కారణంగా ప్రజలు డబ్బు కోసం ఆరాటపడతారు.
2026లో ఆర్థిక విధ్వంసం వస్తుందా?
లాడ్‌బైబిల్ నివేదిక ప్రకారం 2026లో ప్రపంచ సంక్షోభం గురించి బాబా వాంగ జోస్యం చెప్పారు, దీని ప్రకారం 2026లో డిజిటల్ , ఫిజికల్ కరెన్సీ రెండూ కూలిపోవచ్చు. దీనిని నగదు పతనం లేదా ఆర్థిక మాంద్యం అని కూడా పిలుస్తారు. ఈ జోస్యం నిజమైతే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2026లో ప్రపంచ మాంద్యం (Global Recession) ఏర్పడవచ్చు.
ఇది బ్యాంకింగ్ సంక్షోభం, కరెన్సీ విలువ బలహీనపడటం , మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గడానికి దారి తీస్తుంది, దీని కారణంగా చైన్ రియాక్షన్ ప్రారంభం కావచ్చు. ఈ ఒక్క సంక్షోభం నుంచి అనేక ఇతర సంక్షోభాలు ప్రారంభమవుతాయి, దీని వలన ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు సాంకేతిక పరిశ్రమలో అస్థిరత కూడా వస్తుంది. అలాగే బంగారం ధర కూడా ఆకాశాన్ని తాకవచ్చు.
2026లో ప్రమాదకరమైన ఆర్థిక సంక్షోభం రావచ్చని కొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తుంటే..మరికొందరు అది తాత్కాలికమేనని చిన్న చిన్న మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. 2025-2026లో గురు గ్రహం మిథున రాశిలో నీచ స్థితిలో ఉంటుంది, శని-కుజుడు సంయోగాలు వంటి కారణాలతో ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత, స్టాక్ మార్కెట్ క్రాష్, ఫియట్ కరెన్సీ పతనం జరుగుతుందని.. 1929 గ్రేట్ డిప్రెషన్ లాంటి మాంద్యం రావచ్చని 2026లో ఇది పీక్‌కు చేరుతుందని చెబుతున్నారు.
మాంద్యం తీవ్రంగా ఉండదు మార్పులు మంచివే అని కొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు
ఫ్రెంచ్ జ్యోతిష్యుడు ఆండ్రే బార్బాల్ట్ సైకిల్స్ ప్రకారం 2026... 21 శతాబ్ధంలో అత్యధిక పాజిటివ్ పాయింట్ , మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పారు జెస్సికా ఆడమ్స్ వంటి వెస్టన్ జ్యోతిష్యులు 2026లో ఆర్థిక అస్థిరత తగ్గి స్టెబిలిటీ వస్తుందని చెప్పారు 2026 స్టేబుల్ GDP, టెక్ అడ్వాన్స్ మెంట్, ఇన్సోవేషన్ కి అనుకూలం అంటున్నారు మరికొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఇలా 2026లో ఆర్థిక పరిస్థితిపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఆర్థిక సంబంధిత నిర్ణయాలకు జ్యోతిష్యం కన్నా ఎకనామిక్ ఎక్స్ పర్ట్స్ సలహాలు స్వీకరించిన తర్వాతే పెట్టుబడులు పెట్టడం మంచిది అని చెబుతున్నారు నిపుణులు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.