Yanomami Death Ritual of Endocannibalism: ప్రపంచంలోని ప్రతి సంస్కృతి..మరణించిన తమవారికి తాము అనుసరించే సంప్రదాయం ప్రకారం వీడ్కోలు పలుకుతుంది. అయితే కొన్ని ఆచారాలు వింటేనే ఒళ్లు గగొర్పొడుస్తాయి. కొన్ని చోట్ల శవాలను పూడ్చిపెడతారు, మరికొందరు దహనం చేస్తారు, మరికొన్ని చోట్ల వీడ్కోలుకు అర్థం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవుల్లో నివసించే ఒక తెగ ఆచారం ఉంది. ఈ తెగలో మరణం తర్వాత వారి బూడిదను సూప్‌గా మారుస్తారు. ఈ సంప్రదాయం భయానకంగా అనిపించవచ్చు, కానీ దాని వెనుక వారి నమ్మకం చాలా లోతైనది.
మరణాన్ని చూసే కోణం పూర్తి భిన్నంగా ఉంటుంది ఆధునిక ప్రపంచంలో మరణం తర్వాత శాంతిని కోరుకుంటారు, కానీ యానోమామి తెగకు శాంతి మార్గం భిన్నంగా ఉంటుంది. ఈ తెగ వెనిజులా - బ్రెజిల్ సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తుంది. ఇప్పటికీ బాహ్య నాగరికతకు చాలా దూరంగా ఉంది. వారికి మరణం ముగింపు కాదు, ఆత్మ యొక్క తదుపరి యాత్ర ప్రారంభంగా పరిగణిస్తారు. ఈ ఆలోచన వారి అత్యంత ఆశ్చర్యకరమైన సంప్రదాయానికి దారి తీస్తుంది.
బూడిద సూప్ మరియు చివరి వీడ్కోలు
యానోమామి తెగలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత, మృతదేహానికి వెంటనే అంత్యక్రియలు చేయరు. మొదట అడవిలో ఆకులు ,కర్రలతో కప్పి ఉంచుతారు. దాదాపు ఒక నెల తర్వాత దానిని తిరిగి తీసుకొస్తారు. అప్పుడు ఆ శరీరాన్ని దహనం చేస్తారు. ఆ బూడిదను నీట్లో కలుపుకుని కానీ సూప్ చేసి కానీ ఆ కుటుంబం మొత్తం తాగుతుంది బాహ్యప్రపంచానికి భయం - ఆ తెగవారికి గౌరవం బాహ్య ప్రపంచానికి ఈ సంప్రదాయం భయంకరంగా అనిపిస్తుంది, కానీ ఈ తెగ ప్రజలకు ఇది గౌరవానికి చిహ్నం. మరణించిన వ్యక్తి ఆత్మ తన శరీరంలోని వారిలో భాగం అయ్యేవరకు తిరుగుతూ ఉంటుందని వారు నమ్ముతారు. బూడిదను తాగడం వారికి దుఃఖం కాదు, ఆత్మను స్వీకరించే ప్రక్రియ. వారు దీనిని ఎండోకానిబాలిజం అని పిలుస్తారు, అంటే వారి సొంత సమాజంలోని మరణించిన వ్యక్తిని ప్రతీకాత్మకంగా స్వీకరించడం.
ఆత్మ శాంతితో ముడిపడి ఉన్న నమ్మకం
మరణించిన వ్యక్తి బూడిదను కుటుంబం స్వీకరిస్తే..ఆ వ్యక్తి ఆత్మ.. అడవి, గాలి, జీవించి ఉన్న ప్రజల మధ్య శాంతియుతంగా ఉంటుందని యానోమామి తెగ నమ్ముతుంది. అలా చేయకపోతే ఆత్మ కోపంగా ఉంటుందని మొత్తం సమాజానికి ప్రమాదం కలిగిస్తుందని వారు నమ్ముతారు, అందుకే ఈ సంప్రదాయం కేవలం ఆచారం మాత్రమే కాదు, జీవితం - మరణం మధ్య సమతుల్యతకు ఒక మార్గం
ఆధునిక దృక్పథం vs గిరిజన ఆలోచన
నేటి ఆధునిక ఆలోచన ఈ సంప్రదాయాన్ని వింతగా లేదా అంగీకరించలేనిదిగా భావించవచ్చు, కానీ మానవ శాస్త్రవేత్తలకు ఇది సంస్కృతి యొక్క లోతును చూపుతుంది. యానోమామి తెగ యొక్క ఈ ఆచారం ప్రపంచంలో మరణాన్ని అర్థం చేసుకునే మార్గాలు ఎంత భిన్నంగా ఉండవచ్చో చూపిస్తుంది. ఒక వైపు భయం ఉంటే, మరొక వైపు ఆప్యాయత, నమ్మకం భావన కూడా దాగి ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం