2025 జూలై 11th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 11th 2025
మేష రాశి (Aries)
ఈ రోజు కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందదు. విద్యార్థులు ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. చేపట్టిన పనిలో జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తే మీకు మంచి జరుగుతుంది. ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతాయి.
వృషభ రాశి (Taurus)
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. శత్రువుని తక్కువ అంచనా వేసి తప్పుచేయొద్దు. చిన్న చిన్న సమస్యలను తేలిగ్గా తీసుకుని వదిలేయవద్దు. పొట్టకు సంబంధించిన ఇబ్బందులుంటాయి. స్నేహితులను కలుస్తారు. వ్యాపారులు సాధారణ ఫలితాలు పొందుతారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహిస్తారు.
మిథున రాశి (Gemini)
ఈ రాశివారు మీరున్న రంగంలో ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్యంతో పనిచేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబంలో ఒకరి వివాహం గురించి చర్చ ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధాన్ని మంచిగా ఉంచండి. మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త రచనలను ప్రారంభించడానికి రోజు శుభప్రదమైనది.
కర్కాటక రాశి (Cancer)
ఈ రోజు మీరున్న రంగంలో అధికారుల ఆదేశాలమేరకు పనులు చేయాల్సి ఉంటుంది. అనవసరమైన విషయాలపై శ్రద్ధ చూపవద్దు. విద్యార్థులకు నూతన సబ్జెక్టులపై శ్రద్ధ పెరుగుతుంది. ప్రత్యర్థులు మీకు మిత్రులవుతారు. సామాజిక సేవలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది
సింహ రాశి (Leo) ఈ రోజు ఆదాయం బావుంటుంది. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ఒత్తిడి పెరుగుతుంది. మీ దినచర్యలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు మిశ్రమ ఫలితాలుంటాయి. విద్యార్థులు నూతన అధ్యయనాలు చేయడంపై ఆసక్తి చూపిస్తారు.
కన్యా రాశి (Virgo)
ఈ రాశివారు వ్యాపారంలో ఊహించి లాభాలు పొందుతారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితం పొందుతారు. స్నేహితులను కలుస్తారు, శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఆస్తుల కొనుగోలు అమ్మకం విషయంలో ప్రయోజనం పొందుతారు తులా రాశి (Libra)
ఉద్యోగులు, వ్యాపారులు మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఈ రాశివారు జీవిత భాగస్వామితో మంచి సమయం స్పెండ్ చేస్తారు. అవివాహితుల నిరీక్షణ ఫలిస్తుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రభుత్వానికి సంబంధించి చేసే పనిలో విజయం వరిస్తుంది.
వృశ్చిక రాశి (Scorpio)
కుటుంబ సభ్యులతో మంచి సమయం స్పెండ్ చేసినప్పుడే మీ మనసులో ఉండే ఒత్తిడి తొలగిపోతుంది. జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. వివాహిత సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. మీరు స్థిరాస్తిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. అయితే అధిక విశ్వాసం వల్ల నష్టం జరుగుతుంది. ధనుస్సు రాశి (Sagittarius) ఈ రోజు మీ మానసిక స్థితి బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశాలున్నాయి. చేపట్టిన పనితో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది
మకర రాశి (Capricorn)
ఈ రోజు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేయలేదు. ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది. డబ్బు చేతికందుతుంది. కోపం తగ్గించుకోండి. వైవాహిక జీవితంలో తక్కువ సామరస్యం ఉంటుంది. కుంభ రాశి (Aquarius)
ఈ రాశివారికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కళారంగంలో ఉండేవారు గౌరవం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పాత స్నేహితుల నుంచి సహకారం పొందుతారు. మీ పనితీరులో మార్పులు చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు
మీన రాశి (Pisces)
ఈ రోజు మీ పట్ల మీకు విశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన ప్రాజెక్టులలో సక్సెస్ అవుతారు. కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడి తొలగిపోతుంది
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.