జులై నెలలో ఈ రాశివారికి కాస్త నిరాశ తప్పదు
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓసారి శుభసమయం నడిస్తే మరోసారి కాలం ఎదరుతిరుగుతుంది. అలాఅని మన ప్రయత్నంలో ఎలాంటి లోపం ఉండకూడదు. గాల్లో దీపం పెట్టి దేవుడిదే భారం అనకుండా…చేతులు అడ్డుపెట్టి దీపం కొండెక్కకుండా ఆపాలి కదా. అలాగే మన గ్రహస్థితి అనుకూలంగా లేనంతమాత్రమా మన ప్రయత్నంలో లోపం ఉండకూడదంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంతకీ జులై నెల ఎవరికి మిశ్రమ ఫలితాలున్నాయ్…ఎవరికి అంతగా అనుకూలంగా లేదో… జోతిష్య శాస్త్రంలో అపారమైన అనుభవం ఉన్న పండితులు ఏం చెబుతున్నారో చూద్దాం…
వృషభం
గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేనందువల్ల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయ్. ఉద్యోగ జీవితం ప్రశాంతంగానే గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే ప్రయ త్నం చేస్తారు. జూలై నెలలో ఉద్యోగం మారాలనే ఆలోచన అస్సలే వద్దు. అదనపు బాధ్యతలతో పాటూ అధికారుల వేధింపులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
తుల
గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేకపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలవారికి కొద్దిగా చిక్కులు ఎదురవుతాయి. ఆదాయంలోను, లాభాల్లోను పెరుగుదల, ఎదుగుదల కనిపించవు. సమస్యల పరిష్కారంలో కొద్దిగా ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ఆరోగ్యం పరవాలేదు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. తోబుట్టువులు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. చిన్న వ్యాపారులకు, రైతులకు కాస్త కలిసొస్తుంది.
ధనస్సు
ధనస్సు రాశివారికి జూలైలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తాయి. ఆర్థికంగా కొన్ని సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తివ్యాపారాల్లో శ్రద్ధను, శ్రమను పెంచాలి. శని సంచారం కారణంగా మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అనవసర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాల కు వెళ్లే అవకాశం ఉంది. తీర్థయాత్రలకు ప్లాన్ వేస్తారు. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించి నంతగా పురోగతి కనిపించదు. రియల్ ఎస్టేట్, బ్యాంకర్లకు మాత్రం కలిసొచ్చే సమయమే…
మకరం
మకర రాశివారికి ఏలినాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. చిన్న చిన్న పనులకు కూడా అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. ఇంటా బయటా సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవ సరం. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ లో పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీపిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సొంత నిర్ణయాలతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకోండి. హామీలు ఉండవద్దు.
కుంభం
కుంభ రాశివారికి ఉద్యోగంలో ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారంలో కొద్దిగా ప్రతికూలతలు చోటు చేసుకుంటాయి. వృత్తి నిపుణులకు పోటీ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. పెండింగ్ పనులు చాలా వరకూ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇల్లు గానీ, స్థలం గానీ కొనాలని ఆలోచిస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. హామీలు ఉండవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు.