సౌత్ లో హిట్ అయిన చాలా సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సైతం సౌత్ రీమేక్ లతో భారీ విజయాలు అందుకున్నారు. అయితే ఇప్పుడు తమిళ, తెలుగు ఇండస్ట్రీలకు సంబంధించిన కొన్ని సినిమాలను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ బ్లాక్ బస్టర్స్ అందుకున్న సినిమాలు సైతం హిందీకి వెళ్తున్నాయి. మరి ఆ సినిమాలు వాటి స్టోరీలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!


విక్రమ్ వేద : 




కోలీవుడ్ భారీ సక్సెస్ ను అందుకున్న సినిమా ఇది. తెలుగులో రీమేక్ ప్లాన్ చేస్తూనే ఉన్నారు. కానీ వర్కవుట్ అవ్వడం లేదు. ఇంతలో ఈ సినిమా బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. క్యాస్టింగ్ అయితే బాగానే ఉంది కానీ స్టోరీని చెడగొట్టకుండా ఉంటే చాలు. 


ఖైదీ : 




తమిళ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు డబ్ అయింది. రెండు భాషల్లో మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు హిందీలో అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా పట్టాలెక్కుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను హిందీలో నిర్మిస్తున్నారు. 


ధ్రువంగల్ పదినారు : 




ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగులో '16' అనే పేరుతో సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా హిందీ రీమేక్ లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీంతో బాలీవుడ్ లో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 


మానగరం : 




సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో నగరం అనే పేరుతో విడుదల చేశారు. ఏ భాషలో తీసినా సక్సెస్ అయ్యే స్టోరీ ఇది. హిందీలో విక్రాంత్ మాస్సే లాంటి టాలెంటెడ్ హీరో నటిస్తున్నాడు. మరి హిందీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి!


ఆర్ఎక్స్ 100 :




ఊహించని క్లైమాక్స్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి హీరోగా తెరకెక్కిస్తున్నారు. అహాన్ కి ఇది తొలి సినిమా. మరి ఈ కథతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో!


అల వైకుంఠపురములో.. : 




స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా ఇది. ఇండియా వైడ్ గా ఈ సినిమా పాపులర్ అయింది. ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కార్తిక్ ఆర్యన్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. పూజా హెగ్డేనే హిందీలో కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. 


జెర్సీ : 




నాని నటించిన ఈ సినిమా ఓ వర్గం ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిపోయింది. యూత్ ను కూడా మెప్పించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను ఒరిజినల్ డైరెక్టర్ గౌతమే డైరెక్ట్ చేస్తున్నారు. 


హిట్ : 




విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మించిన ఈ సినిమా తెలుగులో మంచి సక్సెస్ అందుకుంది. థ్రిల్లింగ్ సాగిన ఈ కథ హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు నటిస్తున్నారు. ఈ సినిమాను కూడా ఒరిజినల్ డైరెక్టర్ శైలేష్ కొలను రూపొందించనున్నారు.