Friendship Astrology: ఈ ప్రపంచంలో ఒక్కొక్కరది ఒక్కో రకమైన ప్రవర్తన. కొందరు అందరితోనూ కలివిడిగా కలసిపోతారు. మరికొందరు ముభావంగా ఉంటారు. ఇంకొందరు మాట్లాడుతారు కానీ కొన్ని పరిధిలు విధించుకుంటారు. స్నేహం విషయంలోనూ అంతే. కొందరు కొత్త స్నేహాలను తొందరగా ఏర్పాటు చేసేసుకుంటారు. మరికొందరు తక్కువ మందితో స్నేహితులతో సరిపెట్టుకుంటారు. అయితే నాలుగు రాశులవారు మాత్రం స్నేహంకోసం ప్రాణం ఇచ్చేస్తారట. ఈ రాశులవారు స్నేహితులుగా దొరకడం చాలా అదృష్టం అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి ఆ రాశులేంటో చూద్దాం...


Also Read: వివాహానికి అనుకూలమైన రాశులివే!


వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)


వృషభ రాశివారు స్నేహం విషయంలో ఎంతో విధేయతగా, ఎంతో ఆదర్శంగా వ్యవహరిస్తారు. వీరితో ఒక్కసారి స్నేహం ఏర్పడితే ఆ బంధాన్ని జీవిత కాలం వదులుకోరు. స్నేహం కోసం ఎలాంటి త్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. సాధారణంగా ఓ పట్టాన ఎవ్వరితోనూ స్నేహం చేయరు ... చేస్తే వదిలిపెట్టరు. పైగా ఈ రాశివారిలో అద్భుతమైన లక్షణం ఏంటంటే స్నేహం చేయడం మాత్రమే కాదు అవసరమైతే ఎవరో ఒక స్నేహితుడి కుటుంబాన్ని జీవితాంతం పోషించేందుకు కూడా వెనుకాడరు. 



కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)


ఈ రాశి వారికి విస్తృతంగా స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఒకసారి స్నేహం ఏర్పడితే జీవిత కాలం విడిచి పెట్టే అవకాశం ఉండదు. స్నేహం కోసం ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. పైగా ఈ రాసివారు తొందరగా ఆకట్టుకుంటారు. అందుకే వీరితో స్నేహం చేసినవారు అస్సలు వదులుకోరు. వీరు చిన్నప్పటి ఫ్రెండ్స్ తో కూడా ఎప్పటికీ టచ్ లో ఉంటారు. పాత స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. పైగా ఈ రాశివారివల్ల జీవితంలో పైకి ఎదుగుతారట వీరి స్నేహితులు. వీరికి అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 


Also Read: మంచి స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే!


వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)


స్నేహ సంబంధాలకు ఈ రాశివారు కేరాఫ్ అడ్రస్. వీరి మనస్తత్వం తొందరగా ఎవ్వరితోనూ కలవదు కానీ ఒక్కసారి స్నేహం చేస్తే మాత్రం జీవితాంతం వదులుకోరు. కొత్త కొత్త పరిచయాలు కోరుకోరు కానీ చిన్నప్పటి నుంచీ ఉన్న స్నేహితులను అస్సలు వదులుకోరు. ఒక్కోసారి వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులైనా ఎదుర్కొంటారు కానీ స్నేహ బంధాన్ని మాత్రం వీడరు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశివారు స్నేహితులకోసం అనుక్షణం తపిస్తారు కానీ వాళ్లు బయటకు మాత్రం అదే బంధాన్ని నటిస్తారు. లోలోపల స్వార్థంతో నిండిఉంటారు. అంటే వృశ్చికరాశివారు ఉత్తమ స్నేహితులు అవుతారు కానీ వారికి దొరికిన వారు మాత్రం ఉత్తమ స్నేహితులు కాలేరు. ఏ క్షణంలో అయినా వారి స్వార్థాన్ని వాళ్లు చూసుకునే మనస్తత్వాన్ని కలిగిఉంటారు. 


Also Read: చాణక్య నీతి - ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌ ముగ్గురితో స్నేహం ప్రమాదకరం - మీ దోస్తులు ఇలాగే ఉన్నారా?


మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)


మకరరాశి వారు ప్రతిష్టాత్మక వ్యక్తులు. వీరు విశ్వసనీయతకు మారుపేరులాంటివారంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఎక్కువగా కష్టపడి పనిచేస్తారు. మంచి ఫలితాలను పొందుతారు. అదే సమయంలో సక్సెస్ పై ఉన్నంత శ్రద్ధ స్నేహితులపైనా ఉంటుందట. అవసరం అయితే తమ స్నేహితుల కోసం వ్యక్తిగత విషయాలను కూడా పక్కనపెట్టేస్తారట.
 
గమనిక: ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.