Horoscope Today November 10, 2024
మేష రాశి
ఈ రోజు చేపట్టిన ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ ఇమేజ్ అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మాత్రం మీ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు.
వృషభ రాశి
ఈ రోజు వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు మీ ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఈరోజు ఆత్మపరిశీలన చేసుకుంటూ కాలం గడుపుతారు. ఇంట్లో ఆనందం ఉంటుంది.
మిథున రాశి
పరిశోధనా పనిలో ఉన్న వ్యక్తులు శుభ ఫలితాలను పొందుతారు. వివాహానికి అర్హులైన వ్యక్తులకు సంబంధాలు స్థిరపడతాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారంలో మార్పులు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. మీరు పనిచేసే ప్రదేశంలో సహోద్యోగులతో సంబంధాలను స్నేహపూర్వకంగా ఉంచుకోండి
Also Read: కార్తీకమాసంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి - ఏం తినాలి , ఏం తినకూడదు!
కర్కాటక రాశి
ఈ రోజు మీరు అనుకోని ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కాస్త బలహీనంగా ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. భూమికి సంబంధించిన పత్రాలను సురక్షితంగా ఉంచండి.
సింహ రాశి
మీ ఉద్యోగాన్ని మార్చుకోవడానికి ఈరోజు సరైనది. అవసరమైన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. నిర్మాణ పనుల్లో పురోగతి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో చాలా తీవ్రమైన సమస్యల గురించి చర్చిస్తారు. పాత స్నేహితులను కలవవచ్చు. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడతారు.
కన్యా రాశి
ఈ రోజు మీ కార్యాలయంలో బాధ్యతల ఒత్తిడి పెరగవచ్చు. యోగా ధ్యానంపై కాన్సన్ ట్రేట్ చేయండి. అనుభవజ్ఞుల సలహాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. పిల్లల ప్రవర్తన వల్ల మీరు బాధపడవచ్చు. సహోద్యోగులతో సత్సంబంధాలు మెంటైన్ చేయండి.
Also Read: మీరు దర్శించుకుంటున్నది ఎలాంటి శివలింగం - ఎన్ని రకాలున్నాయో తెలుసా!
తులా రాశి
ఈ రోజు వ్యాపారంతో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణం చేయవలసి రావచ్చు. ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. మీ కృషిని , శక్తిని సరైన దిశలో ఉపయోగించేందుకు ప్లాన్ చేసుకోండి. అనుకున్న పనులు పూర్తవుతాయి.
వృశ్చిక రాశి
ఈ రోజు విద్యార్థులు తమ చదువు గురించి ఆందోళన చెందుతారు. సీనియర్ అధికారులతో మీ సంబంధాలు చెడిపోకుండా జాగ్రత్త వహించండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కార్యాలయంలో కొన్ని కారణాల వల్ల మీకు కోపం రావచ్చు. ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతుంది.
ధనస్సు రాశి
ఈ రోజు ఉద్యోగులకు పనిపై శ్రద్ధ ఉండదు. ఇంటి అలంకరణలో మార్పులు చేసుకోవచ్చు. వ్యాపారంలో పెండింగ్ లో ఉన్న డబ్బు తిరిగి పొందవచ్చు. ప్రస్తుతం ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతారు. ఇవాల్టి పనిని వాయిదా వేయొద్దు.
మకర రాశి
ఇంట్లో ఉత్సాహ వాతావరణం ఉంటుంది. పిల్లలు స్నేహితులతో సరదా సమయం స్పెండ్ చేస్తారు. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక సంబంధాలను ఆనందిస్తారు.
కుంభ రాశి
ఈ రోజు మీరు చేపట్టే పనిలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ పాత కృషికి ఉత్తమ ఫలితాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతి లభిస్తుంది. మీరు మీ పనితీరుని మార్చుకునేందుకు ప్రయత్నించాలి. అనుకోని పనులతో బిజీగా ఉంటారు.
Also Read: కార్తీకదీపం నీటిలో ఎందుకు వదలాలి - ఆంతర్యం ఏంటి!
మీన రాశి
ఈ రోజు బాధ్యతలకు సంబంధించి మానసిక ఒత్తిడి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో సమన్వయం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు తమ కస్టమర్ల పట్ల మంచిగా ప్రవర్తించాలి. కుటుంబ జీవితంలో ఒత్తిడి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.