Chandra Grahan 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవిస్తున్నాయి. అందులో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. మొదటి చంద్రగ్రహణం మే 5 న ఏర్పడబోతోంది. ఆరోజు వైశాఖ పౌర్ణమి. చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై అనుకూల ప్రభావం ఉంటుంది. మే 5న పాక్షిక చంద్రగ్రహణం ప్రభావంతో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంది. గ్రహణం సమయంలో ఆయా రాశులపై ఉండే ప్రభావం దాదాపు 15 రోజులు ఉంటుంది.
మేష రాశి (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
మేష రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగ్రహణం చూడకూడదు. అలాగే చంద్రగ్రహణం ప్రారంభం నుంచి 15 రోజులపాటు వీరికి ఆస్థితిలో మార్పుల కారణంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోతారు. అపరిచితులకు అప్పు ఇవ్వవద్దు. రిస్కీ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. గ్రహణం రోజున శివ పంచాక్షరి పఠించాలి..చీమలకు పంచదార వేయాలి.
Also Read: మే 5న చంద్ర గ్రహణం, భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుంది
కర్కాటక రాశి (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
కర్కాటక రాశి కూడా చంద్రగ్రహణం వల్ల చాలా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు వచ్చే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇతరులతో వివాదాలకు వాదనకు దిగవద్దు. అనవసర విషయాలతో జోక్యం చేసుకోవద్దు. గ్రహణం అనంతరం ఆంజనేయ స్వామి గుడిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి.
తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
తులా రాశి వారు కూడా చంద్రగ్రహణం రోజు దూర ప్రయాణాలు చేయవద్దు. అంతేకాదు.. చంద్రగ్రహణం తర్వాత 15 రోజుల పాటు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సీటు బెల్టు లేకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దు. ఎవ్వరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. గ్రహణం అనంతరం శివాలయానికి వెళ్లి పాలాభిషేకం చేయండి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాాదాలు)
మకర రాశి వారు చంద్రగ్రహణం రోజు నీటిలో ప్రయాణానికి దూరంగా ఉండాలి. చంద్రగ్రహణం అనంతరం 15 రోజులపాటు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూ ఉండేవారే మోసం చేసే ప్రమాదం ఉంది జాగ్రత్త. ముఖ్యంగా ఉద్యోగం చేసే ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. గ్రహణం అనంతరం అమ్మవారి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టండి.
Also Read: ఏప్రిల్ ఆఖరి వారం 7 రాశులవారికి అద్భుతం - 5 రాశులవారికి కొంత నిరుత్సాహం!
కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాాదాలు)
కుంభ రాశివారు కూడా గ్రహణం రోజు నుంచి రెండు వారాల పాటు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ఆలోచన ఫలిస్తుంది. భార్య భర్తల మధ్య అనుమానాలు తలెత్తే అవకాసం ఉంది..జాగ్రత్తగా ఉండండి. అనవసర వివాదాలు పెట్టుకోవద్దు. గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చదవడం మంచిది.