Daily Horoscope for 9 September 2024
మేష రాశి
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉండడంతో ఆందోళన చెందుతారు. అనవసర వివాదాల వల్ల ఈ రోజంతా చికాకుగా ఉంటుంది. రహస్య అభ్యాసాలపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వస్తువులను సురక్షితంగా ఉంచండి. ఈ రాశి స్త్రీలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృషభ రాశి
ఈ రోజు అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. సామాజిక సేవలో ఉన్న వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. బ్యాంకింగ్ మరియు మేనేజ్‌మెంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు లాభపడతారు. కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు.
మిథున రాశి
అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు. పిల్లలు చదువులో రాణిస్తారు. అవసరమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక వృద్ధి - వార ఫలాలు ( సెప్టెంబరు 09 - 15)
కర్కాటక రాశి
పరిశోధన రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలను ఆస్వాదిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. వ్యాపార లాభదాయకంగా ఉంటుంది.
సింహ రాశి
ఈ రోజు కొన్ని అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఒకేసారి నాలుగైదు పనులు చేయాలనే ఆలోచన పక్కనపెట్టేయండి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. కుటుంబ సభ్యుల నుంచి మీపై ఒత్తిడి ఉంటుంది. మీ ఆలోచనలను ప్రియమైనవారితో పంచుకుంటారు.
కన్యా రాశి
ఈ రోజు మీరు లక్ష్యాలను పక్కనపెట్టేస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. నూతన ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. భౌతిక సుఖాలను అనుభవిస్తారు.
తులా రాశి
ఈ రోజు ఎంతో కష్టపడితే కానీ సాధారణ ఫలితం అందుకోలేరు. ఉద్యోగులు, వ్యాపారులు తమ పనులపై శ్రద్ధ వహించాల. ప్రతికూల వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండాలి. విద్యార్థులు చదువుపై చాలా శ్రద్ధ వహించాలి.
వృశ్చిక రాశి
గృహ నిర్వహణకోసం ఖర్చు చేస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో అనవసర వాదనలకు దిగొద్దు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ప్రయోజనాలు పొందుతారు. అనవసర ఆలోచనల వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మీ పెద్దలతో అభిప్రాయ బేధాలు పరిష్కారం అవుతాయి.
Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!
ధనస్సు రాశి
ఈ రోజు ఈ రాశులవారు సోమరిగా ఉంటారు..ఏ పనిపైనా ఆసక్తి చూపించరు. నూతన ప్రాజెక్టులు ప్లాన్ చేసుకోవడంపై మాత్రం శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగులతో ఇబ్బందులుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన పెరుగుతుంది.
మకర రాశి
అనుకున్న పని సకాలంలో పూర్తి కాకపోవడంతో విచారంగా ఉంటారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. పనితీరుని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళనలు దూరమవుతాయి.
కుంభ రాశి
ఈ రోజు కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. చట్టపరమైన విషయాలు సులభంగా పరిష్కారం అవుతాయి. కొత్త స్టార్టప్ ప్లాన్ గురించి ఆలోచిస్తారు. తల్లిదండ్రుల నుంచి మంచి సలహాలు పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీన రాశి
శుభ కార్యాలకు హాజరవుతారు. ఇంట్లో-కార్యాలయంలో మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కోకతప్పదు. మీ సన్నిహితులకు సహాయం చేయాల్సి వస్తుంది. రోజంతా సంతోషంగా ఉంటారు.
Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.