Venus in Leo 2024 july 31st to August 25th: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికలో మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. గ్రహాల గమనం మార్చుకున్న ప్రతిసారీ ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది..అవి కొన్ని రాశులవారిపై శుభ ఫలితాలు, మరికొన్ని రాశులవారిపై మిశ్రమ ఫలితాలు, ఇంకొన్ని రాశులవారిపై అశుభఫలితాలు చూపిస్తాయి. మారుతున్న రాశి ఆధారంగా ఫలితం నిర్ణయిస్తారు. భౌతిక ఆనందం, కీర్తి, కళలు, ఐశ్వర్యం, వైవాహిక జీవితంలో ఆనందానికి కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు.. జూలై 31 న సింహ రాశిలో ప్రవేశించి ఆగష్టు 25 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం ..
Also Read: గురు పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు -APSRTC, TSRTC ప్యాకేజీలివే!
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
సింహ రాశిలో శుక్రుడి సంచారం మేషరాశివారికి అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ సాధ్యం అవుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేయాలన్న మీ కోర్కె నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
శుక్రుడి సంచారం మిథున రాశివారికి ఊహించని ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులకు ఇది వరం లాంటి సమయం. వ్యాపారులు ఈ సమయంలో పెట్టే ప్రతి పెట్టుబడి మంచి లాభాలను అందిస్తుంది.
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు సింహ రాశిలోకే ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ మళ్లీ పట్టాలెక్కుతాయి...పూర్తవుతాయి. ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. చేసే పనికి ప్రశంసలు అందుకుంటారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. పదోన్నతి ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఉంటారు..
ఈ ఫలితాలు శుక్రుడు సింహ రాశిలో ఉన్నంతవరకే...మళ్లీ రాశి పరివర్తనం చెందినప్పుడు ఫలితాల్లో మార్పులుంటాయి. జూలై 31 న సింహరాశిలో అడుగుపెట్టే శుక్రుడు..ఆగష్టు 25 వరకూ ఇదే రాశిలో ఉండి..ఆ తర్వాత కన్యా రాశిలోకి మారుతాడు.. ఆ సమయంలో మళ్లీ 12 రాశులపై ప్రభావం మారుతుంది...
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!