మనసులో ఉండే సంతోషం, బాధ, కష్టం, నష్టం అన్నీ ఎవరో ఒకరితో పంచుకుంటే మనసు తేలికపడుతుంది. పైగా కొన్ని సలహాలు తీసుకోవడం వల్ల ఏదైనా పరిష్కార మార్గం కూడా దొరుకుంది. అయితే మనం కేవలం ఆత్మీయులతో మాత్రమే ఇవన్నీ చెప్పగలం... చెప్పేముందు... ఎవ్వరికీ చెప్పొద్దని చెబుతాం. అయినప్పటికీ కొందరు సీక్రెట్ మెంటైన్ చేయలేరు. కింగ్ అండ్ టామరెండ్ డ్రమ్ అదే రాజుకి కొమ్ములొచ్చిన కథలో క్యారెక్టర్‌లా అన్నమాట. భూమ్మీద అత్యంత అందమైన వ్యక్తిని నేనే అని రాజు విర్రవీగుతుంటాడు...ఓ సందర్భంలో దేవతల కన్నా తానే అందగాడినంటాడు. ఆ మాట విన్న దేవతలు.... తలపై కొమ్ములు రావాలని శపిస్తారు. మంగలిని మాత్రమే పిలిచి సొల్యూషన్ చెప్పమన్న రాజు...ఈ విషయం ఎవ్వరికీ చెప్పొందంటాడు. అస్సలు ఆగలేని ఆ వ్యక్తి ఓ చింతచెట్టు దగ్గరకెళ్లి రాజుకి కొమ్ములొచ్చాయి అని ముూడసార్లు అంటాడు. ఆ తర్వాత ఆ చెట్టు కర్రతో తయారు చేసిన వాయిద్యాన్ని వాయిస్తుంటే రాజుకి కొమ్ములొచ్చాయని అనే శబ్దం వస్తుంటుంది. ఈ కథలో క్యారెక్టర్ లానే కొన్ని రాశుల వారు అస్సలు రహస్యాన్ని దాచలేరు. వాళ్లెవరో చూద్దాం...
మేషం
మేషరాశిపై అంగారకుడి ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ఈ రాశివారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఒక్కోసారి అత్యుత్సాహం కూడా ఎక్కువే. అందుకే ఎవ్వరికీ చెప్పొద్దనే మాట వీళ్లకి అస్సలు నచ్చదు. పైగా ఎవ్వరికీ చెప్పొద్దంటే... తనకు మాత్రమే తెలుసనే ఆలోచనతో.... ఎదుటి వారికి చెప్పేస్తారు. రహస్యం అంటే వీళ్లకి నచ్చదు. వెంటనే ఇతరులతో పంచుకుంటారు.అందుకే ఈ రాశివారికి ముఖ్యమైన విషయాలు చెప్పేవిషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మిథునం..
మిథున రాశివారు మాటకారులు. ఎంచక్కా మాట్లాడుతూ అందరితో ఇట్టే కలసిపోతారు. అదే సమయంలో వీరి నోట్లో నూగింజ నానదు. ఏదైనా విషయం తెలిస్తే ఎదుటి వారికి చెప్పకుండా అస్సలు ఆగలేరు. ఏ విషయం అయినా అస్సలు ఆలోచించకుండా చెప్పేస్తారు. అందుకే మిధునరాశివారితో సీక్రెట్స్ చెప్పడానికి కాస్త ఆలోచించండి.
కర్కాటకం..
కర్కాటక రాశివారిది చంచల స్వభావం. ఏ క్షణం ఎవరితో ఏం చెప్పేస్తారో తెలియదు. మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పుకెళ్లిపోతారు. కొన్ని చెప్పకూడనివి ఉన్నప్పటికీ అస్సలు ఆలోచించరు. అంతా జరిగాక మాత్రం తలుచుకుని బాధపడతారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది. అందువల్ల ఈ వ్యక్తులతో అత్యంత ముఖ్యమైన రహస్యాలని పంచుకోవద్దు.
తుల..
తుల వారు లెక్చర్లు ఇవ్వడంలో ముందుంటారు. వీరితో చర్చల్లో పాల్గొనే వారు ఎన్నో విషయాలు తెలుకుంటారు. వీరి స్వభావరీత్యా చిన్న చిన్న విషయాలను కూడా మూడో వ్యక్తికి చెబుతారు. అలా చెప్పేవరకూ మనశ్సాంతి ఉండదు. అందుకే ఈ రాశివారికి కూడా అన్ని విషయాలు చెప్పకుండా ఉండడం మంచిది.
ధనస్సు..
ధనస్సు రాశివారిపై గురుగ్రహం ప్రభావం ఎక్కువ. ఏ క్షణంలో ఎంతటివారినైనా వశపరుచుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది. మాటల్లో పడితే అన్నీ మరిచిపోతారు. ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నారో కూడా మరిచిపోయి...అవసరమైనవి..అవసరం లేనివి....రహస్యంగా ఉంచాల్సినవి కూడా చెప్పేస్తారు. అందుకే ఈ రాశి ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలంటే వీరికి ఏ విషయం చెప్పకపోవడమే మంచిది.