4 Months Money Horoscope: శుక్రుడి సంచారం బావుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించినట్టే...అయితే మిగిలిన గ్రహాల సంచారంపై కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. శుక్రుడి సంచారంతో పాటూ మిగిలిన గ్రహాలు కూడా ఈ మూడు రాశులవారికి నాలుగు నెలల పాటు శుభఫలితాలను అందిస్తున్నాయి. ఫలితంగా ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు వరకూ 3  రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఊహించని డబ్బు చేతికందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలతో పురోభివృద్ధి ఉంటుంది. ఆ రాశులేంటి? మీ రాశి ఇందులో ఉందా? ఇక్కడ తెలుసుకోండి...

Also Read: పుట్టలో పాలు పోసేది పాముల కోసం కాదా? పుట్ట మన్ను చెవులకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా!

కర్కాటక రాశి (Cancer)  

ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు...ఈ నాలుగు నెలలు కర్కాటక రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. కెరీర్లో పురోగతికి మంచి అవకాశాలుంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి.

సింహ రాశి (Leo) 

ఈ రాశివారికి కూడా ఈ నెల నుంచి నవంబరు వరకూ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. అయితే ఖర్చులు నియంత్రించాల్సిన సమయం ఇది...

ధనుస్సు రాశి  (Sagittarius)  

ఆగష్టు నుంచి రానున్న 4 నెలల పాటూ ధనస్సు రాశివారికి అత్యంత ప్రయోజకరంగా ఉండబోతోంది. గ్రహాల శుభసంచారంతో పాటూ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మారుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారులకు శుభసమయం. 

Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!

 నవగ్రహ ధ్యాన శ్లోకంఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥

రవిఃజపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥

చంద్రఃదధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం  నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ॥

కుజఃధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ ।కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ॥

బుధఃప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥

గురుఃదేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ ।బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥

శుక్రఃహిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ ।సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥

శనిఃనీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥

రాహుఃఅర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥

కేతుఃపలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ।రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥

ఫలశ్రుతిఃఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః ।దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి-ర్భవిష్యతి ॥

నరనారీ-నృపాణాం చ భవే-ద్దుఃస్వప్న-నాశనమ్ ।ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ॥

గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః॥

ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్ ।

Also Read: పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.