జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడు చాలా ప్రధానమైన గ్రహం. శనీశ్వరుడి గమనాన్ని బట్టే వ్యక్తుల లేదా పరిస్థితుల శుభాశుభ కాలాన్ని నిర్ణయించవచ్చు. శని గ్రహానికి మందుడు అని పేరు. ఇతను చాలా నెమ్మదిగా కదులుతాడు సాధారణంగా శనీశ్వరుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి వెళ్లడానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు.
శనీశ్వరుడు ప్రస్తుతం సొంత రాశి చక్రమైన కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఇప్పుడు అక్టోబర్ 23 న ఉదయం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు తిరిగి మకరరాశికి చేరుకోనున్నాడు. ఆరోజు ధన త్రయోదశి కూడా. మకరరాశిలో చేరుకున్నప్పటికీ శని వక్రమార్గంలో ప్రయాణిస్తాడు. దీనివల్ల కొన్నిరాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి. మరికొన్ని రాశుల వారికి శుభఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో శని జనవరి 2023 వరకు ఉంటాడు. ఆ తర్వాత తిరిగి కుంభరాశిలోకి వెళ్తాడు. ఈ సందర్భంగా శని మకరరాశిలో ప్రవేశించడం మూలానా కొన్నిరాశుల వారికి లాభదాయక సూచనలు ఉన్నాయి. ఈ దీపావళి సందర్భంగా ఆ రాశులకు కనకవర్షం కురవనుంది. మరి ఆ రాశులేంటో తెలుసుకుందాం!
మేష రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు వక్రమార్గంలో మకరరాశిలోకి చేరుతున్నందున్న ఈరాశి వారికి శుభఫలితాలుంటాయి. ప్రస్తుతం శని ఈ రాశివారికి 10వ స్థానంలో ఉన్నాడు. అది శుభప్రదం. అందువల్ల ఈ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుంది. అంతేకాదు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి శుభసమయం. అయితే డబ్బు కొంత అధికంగా ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఆ ఖర్చు మంచి వాటికోసం మాత్రమే వినియోగిస్తారు. దానివల్ల భవిష్యత్తులో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఇంటా, బయట గౌరవమర్యాదలు కలుగుతాయి.
తులా రాశి
తులారాశి వారికి ఈ శనిగ్రహ సంచారం లాభాన్ని చేకూరుస్తుంది. ఎప్పటి నుంచో చేయకుండా అలాగే ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో వ్యయప్రయాసలు ఉన్నా అవన్నీ పూర్తి చేస్తారు. ఎప్పటి నుంచో ఉన్న ఆర్థికపర ఇబ్బందులన్నీ సమసిపోతాయి. ఆర్థికపరమైన విషయాలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. రుణబాధలు తీరిపోయే సూచనలు ఉన్నాయి. ఇది మీకు మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
ధనస్సు రాశి
శని మకరరాశిలో ప్రవేశిస్తున్నందున్న ధనస్సురాశి వారికి అదఈష్టం కలిసిరానుంది. కనకవర్షం కురుస్తుంది. ఈ రాశి వారికి జనవరి వరకు లాభదాయకంగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. దాని వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఎప్పటి నుంచో రాని మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. సమాజంలో కీర్తిప్రతిష్టతలు పెరుగుతాయి.
మీన రాశి
శని మకరంలోకి వెళ్లడం వల్ల ఈ రాశివారు అన్నింటా అఖండమైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశాలున్నాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. మానసిక ఉల్లాసంతో కాలం గడుపుతారు. ఆర్థికపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన కాలం.
Also Read: ఈ నెల 25న సూర్యగ్రహణం, దీపావళి 24 లేదా 25 ఎప్పుడు జరుపుకోవాలి!