Astrology: నవగ్రహాల్లో అత్యంత ఆలస్యంగా కదిలేది శనిగ్రహం అయితే..అత్యంత తొందరగా రాశి పరివర్తనం చెందే గ్రహం బుధుడు. మూడు వారాలు, నాలుగు వారాలు...ఒక్కోసారి రెండు వారాలకే రాశి మారిపోతుంచాడు. ఫిబ్రవరి 09 ఆదివారం సాయంత్రం 5 గంటల 11 నిముషాలకు మకరం నుంచి కుంభంలో అడుగుపెడతాడు బుధుడు. నెలాఖరువరకూ ఇదే రాశిలో ఉంటాడు.  గ్రహాల రాకుమారుడైన బుధుడు  కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్, లాజిక్, మ్యాథమెటిక్స్ మరియు బిజినెస్ కి కారకుడు. మరి కుంబంలో బుధుడి ప్రభావం ఏ రాశిపై ఎలా ఉందంటే.. మేష రాశి

మీ రాశి నుంచి పదకొండో స్థానంలో ఉండే బుధుడు మీకు అన్నింటా విజయాన్నిస్తాడు. ఫిబ్రవరి నెలాఖరు వరకూ మీరు ఏ పని ప్రారంభించినా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో ముఖ్యమైన మార్పులొస్తాయి

వృషభ రాశి

మీ రాశి నుంచి పదో స్థానంలో సంచరిస్తున్న బుధుడు వృత్తి, ఉద్యోగాలలో మంచి ఫలితాలనిస్తుంది. నూతన ఉద్యోగం కోసం ఎదురూచూస్తున్నవారి నిరీక్షణ ఫలిస్తుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, విద్య మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు.

Also Read: భీష్మ ఏకాదశి ఎప్పుడు..ప్రాముఖ్యత ఏంటి - ఈ రోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమం ఏంటి!

మిథున రాశి

మీ రాశినుంచి తొమ్మిదో స్థానంలో ఉండే బుధుడు మీ సౌకర్యాలను మెరుగుపరుస్తాడు. వ్యాపారంలో వృద్ధి సాధించేలా సహకరిస్తాడు. ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. 

కర్కాటక రాశి

మీ రాశి నుంచి ఎనిమిదో స్థానంలో ఉండే బుధుడు ఆకస్మిక ప్రయోజనాలను అందిస్తాడు. వృత్తి, ఉద్యోగాలలో ఉండే ఇబ్బందుల నుంచి గట్టెక్కేలా సహకరిస్తాడు

సింహ రాశి కుంభంలో బుధుడి సంచారం మీ రాశి నుంచి ఏడో ఇంట ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆర్ధిక లాభం పొందుతారు, భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు. 

కన్యా రాశి కన్యా రాశి నుంచి ఆరో ఇంట సంచరిస్తోంది బుధుడు. ఈ సమయంలో మీరు అదృష్టానికి కేరాఫ్ లా మారుతారు. వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన మార్పులొస్తాయి. ఆదాయం పెరుగుతుంది. 

తులా రాశి

కుంభంలో బుధుడి సంచారం అంటే తులా నుంచి ఐదో స్థానంలో ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో డబ్బు ఆదాచేస్తారు. 

Also Read: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి..ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!

వృశ్చిక రాశి

నాలుగో ఇంట బుధుడి సంచారం మీ జీవితంలో కొన్ని సమస్యలు తీసుకొస్తుంది. మీ కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. 

ధనస్సు రాశి

కుంభంలో బుధుడి సంచారం మీ రాశి నుంచి మూడో స్థానంలో ఉంటుంది. ఈ సమయంలో మీ కెరీర్లో వృద్ధి ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక వృద్ధి ఉంటుంది.  

మకర రాశి

మీ రాశి నుంచి రెండో స్థానంలో బుధుడి సంచారం మీ మాటతీరులో మాధుర్యం నింపుతుంది. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. స్నేహితులు , సన్నిహితులు మీతో సంతోషంగా ఉంటారు. వ్యాపారం, ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి

కుంభ రాశి

మీ రాశిలోనే బుధుడి సంచారం ఉండడం వల్ల ఫిబ్రవరి నెలాఖరు వరకూ మీరు ఆర్థిక ప్రయోజనాలుంటాయి. కెరీర్లో లక్ష్యాలు సాధించేందుకు మీరు వేసే అడుగులు సక్సెస్ అవుతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు

మీన రాశి మీ రాశి నుంచి పన్నెండో స్థానంలో బుధుడి సంచారం మీకు సకల కార్యాల్లో విజయాన్ని అందిస్తుంది. ఫిబ్రవరి ఆఖరు వరకూ మీరు ప్రారంభించిన ఏ పని అయినా సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుంది.

Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.