ఫిబ్రవరి 4 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో మీ పనితీరు ప్రశంసలు పొందుతుంది. సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ప్రయాణించేటప్పుడు తెలియని వ్యక్తులను విశ్వసించి రిస్క్ తీసుకోకండి.
వృషభ రాశి
ఈ రోజు ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేస్తారు. వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది.
మిథున రాశి
ఈ రోజు అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో అనవసర చర్చలకు దిగొద్దు. వ్యాపారులు మంచి ఫలితాలు పొందలేరు. ఉద్యోగులు పనిని నిర్లక్ష్యం చేయవద్దు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. మనసు చెప్పింది వినండి.
Also Read: రథసప్తమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. మీ ప్రవర్తనతో అందరూ సంతోషంగా ఉంటారు. ఫైనాన్స్‌కు సంబంధించిన కార్యకలాపాలకు రోజు జాగ్రత్తలు తీసుకోండి.
సింహ రాశి
ఈ రోజు మీరున్న రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులు మీ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు.
కన్యా రాశి
ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. కర్మాగారాలలో పనిచేసే వారు భద్రతా ప్రమాణాలను అనుసరించండి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు పెరుగుతాయి.
తులా రాశి
ఈ రోజు ఇంట్లో ఆనందం ఉంటుంది. ఆహారం తీసుకోవడం నిర్లక్ష్యం కారణంగా పొట్టకు సంబంధించిన ఇబ్బందులుంటాయి. మీ రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అనవసర ప్రయాణాలు చేయవద్దు.
Also Read: అనారోగ్యం దరిచేరనివ్వని ద్వాదశ ఆదిత్యుల ఆరాధన - ఎవరా 12 మంది ఆదిత్యులు!
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేందుకు మంచి రోజు. వైవాహిక జీవితం శృంగారంతో నిండి ఉంది. ఆస్తి కొనుగోలు , అమ్మకం ద్వారా ప్రయోజనం పొందుతారు. థియేటర్లు మరియు హోటల్ రంగాల్లో ఉండే వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. విదేశాల్లో విద్యనభ్యసించే వారికి ఈ రోజు మంచిది. వృత్తిపరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులను ప్రాధాన్యతలోకి తీసుకురావడం ద్వారా పూర్తి చేయండి. మీరు భాగస్వామ్యంతో పనిచేయాలనుకుంటే ఈ రోజు చాలా బాగుంది. ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉండండి.'
మకర రాశి
ఈ రోజు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతుంది. ఇంటి పెద్దలు మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. సహోద్యోగుల సలహాపై శ్రద్ధ వహించండి.స్నేహితుల కారణంగా సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి
ఈ రోజు మీరు మీ దినచర్య మారుతుంది. వ్యక్తిగత జీవితంలో కలతలు పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారం సక్రమంగా సాగుతుంది. మీరున్న రంగంలో ప్రశంసలు పొందుతారు. ఈ రోజు మీకు కలిసే కొత్తవ్యక్తులు మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతారు.
మీన రాశి
మీరు ప్రారంభించే పనులకు అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తారు. నూతన వ్యాపారం, ఉద్యోగం ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!