ఏప్రిల్ 30 రాశిఫలం
మేష రాశి
ఈ రోజు మీకు శుభదినం. ఏదైనా పాత వివాదం నుంచి విముక్తి పొందుతారు. దీని వల్ల మీకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో లాభయోగం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఏదైనా కొత్తపనిని ఈ రోజు ప్రారంభించవచ్చు. వృషభ రాశి ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన పని పూర్తవుతుంది. ఈ రోజు ఓ ప్రత్యేక వ్యక్తిని కలవడం వల్ల మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. ఏదైనా ధార్మిక యాత్రకు వెళ్ళాలనే ఆలోచన మీ మనసులో రావొచ్చు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు
మిథున రాశి ఈ రోజు మీకు శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. మీ మనసులో చాలా సందేహాలు వస్తాయి. ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. కొత్త ప్రాజెక్టుకి సంబంధించి నూతన ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారంలో మందగమనం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది
కర్కాటక రాశి ఈ రోజు మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో భాగస్వాములు మీకు వ్యతిరేకంగా మారుతారు. కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత జీవితం గురించి పెద్ద నిర్ణయం తీసుకుంటారు.
సింహ రాశి
ఈ రోజు మీరు నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ఆగిపోయిన డబ్బులు లభిస్తాయి. సామాజిక, రాజకీయ రంగాల్లో మీరు ఓ ప్రత్యేకమైన గౌరవం పొందుతారు. వ్యాపారంలో పెద్ద లాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. భార్య, పిల్లలతో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
కన్యా రాశి ఈ రోజు మీరు కొన్ని విషయాలను పట్టించుకోకపోవడం మంచిది. లేదంటే పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించండి. కొత్త పనిని ప్రారంభించవద్దు. అలాగే మీ భాగస్వామితో మీ మనసులోని మాట చెప్పకండి తద్వారా నష్టపోతారు. కుటుంబంలో అంతర్గత కలహం ఏర్పడవచ్చు.
తులా రాశి ఈ రోజు ఏదో చికాకు మిమ్మల్ని వెంటాడుతుంది. ప్రారంభించిన పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. వ్యాపారంలో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. నూతన పనిని ప్రారంభించేముందు ఆలోచించి అడుగువేయండి. పిల్లల ఆరోగ్యం , చదువు గురించి ఆందోళన చెందుతారు.
వృశ్చిక రాశి ఈ రోజు మీరు మీ ప్రియమైన వ్యక్తి ఆరోగ్యం గురించి చింతిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించవచ్చు. వ్యాపారంలో మీ భాగస్వామి మీకు సహాయం చేస్తాడు. పెద్ద ప్రాజెక్టును ఈ రోజు ప్రారంభిస్తారు కానీ పనిలో తప్పనిసరిగా అడ్డంకులు వస్తాయి. మాటలపై నియంత్రణ ఉంచుకోండి.
ధనుస్సు రాశి ఈ రోజు మీరు దూరం ప్రయాణం చేస్తే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. కొత్త పని ప్రారంభించేముందు సహచరుల నుంచి సలహాలు స్వీకరించండి. వ్యాపారం నూతన పెట్టుబడులు పెట్టొద్దు. కొత్త వాహనం కొనాలనే ఆలోచన చేస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
మకర రాశి ఈ రోజు మీరు అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబంలో జరిగే చర్చల్లో మిమ్మని విభేదించేవారు పెరుగుతారు. వ్యాపారంలో మీరు మోసపోతారు. ఉద్యోగులకు పనిచేసే ప్రదేశంలో అడ్డంకులు తప్పవు.
కుంభ రాశి ఈ రోజు మీరు మాటలపై నియంత్రణ ఉంచుకోవాలి. అనవసర చర్చల నుంచి దూరం పాటించడం మంచిది. కుటుంబ జీవితంలో హెచ్చు తగ్గులుంటాయి. మీరు ఏదైనా పని నిమిత్తం ఓ ప్రత్యేక వ్యక్తిని కలుసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మీన రాశి ఈ రోజు మీరు వ్యక్తిగత జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకుంటారు..ఈ ప్రభావం మీ కుటుంబంపై పడుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు పెద్ద ఒప్పందంలో భాగస్వామి అవుతారు, దీనివల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో అంతర్గత వివాదాలు తగ్గుతాయి.