August Grah Gochar: చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు జలదానం చేయాలి, శివుడికి అభిషేకం నిర్వహించాలి, ప్రశాంతమైన మనసుతో సాధన చేయాలి. శుక్ల యోగం ఏర్పడుతున్నందున శివపార్వతులకు తెల్లటి పూలు సమర్పించాలి. నవమి తిథిలో దుర్గా అష్టోత్తరం జపిస్తే మంచి జరుగుతుంది. ఆగష్టు 02 న పంచాగం ఏంటి? ఏ రాశులవారికి మంచి జరుగుతుంది? ఎవరికి ప్రతికూల ఫలితాలున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పండింతులు చెప్పిన వివరాలు ఇక్కడ చూడండి.

ఆగష్టు 02 పంచాంగం (Panchang 2 August 2025)

వివరాలు సమాచారం
తిథి అష్టమి (05:47 AM వరకు), తరువాత నవమి
నక్షత్రం విశాఖ (పూర్తి రోజు)
యోగం వాషి, ఆనందాది, సునఫా, బుధాదిత్య, శుక్ల
చంద్ర గోచారం 11:53 PM తర్వాత వృశ్చిక రాశిలో
అభిజిత్ ముహూర్తం 12:15 PM – 01:30 PM
అమృత ఘడియలు 09:35 AM – 11:21 AM
రాహుకాలం 09:00 AM – 10:30 AM

ఆగష్టు 02 శనివారం గ్రహాల వల్ల  ఏర్పడే ప్రత్యేక యోగాలు:

శుక్ల యోగం: శక్తి - నిర్ణయం తీవ్రత పెరుగుతుంది

బుధాదిత్య యోగం: జ్ఞానం - వాణిలో ప్రభావం

సునఫా యోగం: ధనం  - అదృష్టం  సూచన

చంద్రుడు వృశ్చికంలో ఉన్నప్పుడు ఓ రాశివారికి ఎలాంటి హెచ్చుతగ్గులుంటాయి?

 

రాశి సవాళ్లు లాభం పరిహారం
మేషం వైవాహిక జీవితంలో ఒత్తిడి వ్యాపారంలో లాభం సూర్యుడికి  అర్ఘ్యం సమర్పించండి
వృషభం ఖర్చులు - గందరగోళం పెరుగుదల ఆరోగ్య ప్రయోజనాలు ఆకుపచ్చ దుస్తులు ధరించండి
మిథునం సరైన నిర్ణయం తీసుకోలేరు ప్రేమ - చదువులో పురోగతి దేవి పూజ చేయండి
కర్కాటకం కుటుంబంలో గందరగోళం శ్రద్ధ అవసరం ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి 
సింహం ఆరోగ్యం క్షీణత కెరీర్‌లో విజయం హనుమాన్ చాలీసా చదవండి
కన్య అలసట, కాళ్ల నొప్పులు ఆర్థిక లాభం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి
తుల బాధ్యతలు పెరుగుతాయి పనులు పూర్తవుతాయి   పెరుగు-బియ్యం దానం చేయండి
వృశ్చికం మానసిక స్థితి అస్థిరంగా ఉంటుంది ఏమీ లేదు శివ మంత్రం పఠించండి
ధనుస్సు ఖర్చులు పెరుగుతాయి ధన లాభం, కెరీర్ ప్లానింగ్ అరటిపండు దానం చేయండి
మకరం బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారం-కెరీర్ లాభం పెద్దల ఆశీర్వాదం తీసుకోండి
కుంభం కొద్దిగా జలుబు గౌరవం  కీర్తి పెరుగుతుంది విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి
మీనం వ్యతిరేకత గందరగోళం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది శని స్తోత్రం పఠించండి

ప్రశ్న 1. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల కలిగే ప్రభావం ఏమిటి?లోతైన భావోద్వేగాలు, సంబంధాలలో చిక్కులు, ఆకస్మిక మానసిక పరధ్యానం.

ప్రశ్న 2. శుక్ల యోగం ఏ రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది?సింహం, తుల, మకరం, కుంభ రాశులకు కెరీర్  గౌరవంలో లాభం.

ప్రశ్న 3.  చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఏ రాశి వారు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి?వృశ్చికం, మీనం, కన్యా రాశి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.