Ysrcp Released 3 Incharges List: 'వై నాట్ 175'.. ఇదీ ప్రస్తుతం సీఎం జగన్ (CM Jagan) నినాదం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసిన వైసీపీ (Ysrcp).. పలువురు సిట్టింగులకు సైతం షాకిచ్చింది. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలంటూ పలు చోట్ల కీలక మార్పులు చేసింది. కొన్ని చోట్ల వారు ప్రాతినిథ్యం వహిస్తోన్న చోటు నుంచి కాకుండా వేరే చోటు నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారికి ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేలా ఆదేశాలిచ్చింది. పలువురు మంత్రులు సైతం ఈ జాబితాలో ఉన్నారు. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు ఇంఛార్జీలను మార్చగా, రెండో జాబితాలో 27 మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. తాజాగా 21 మందితో మూడో జాబితాను విడుదల చేయగా.. ఇప్పుడు నాలుగో జాబితాపై టెన్షన్ నెలకొంది. అయితే, సంక్రాంతి దృష్ట్యా ఈ జాబితాను పండుగ తర్వాతే విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


అసంతృప్తుల స్వరం


మరోవైపు, రిలీజ్ చేసిన జాబితాల్లో తమకు స్థానం దక్కకపోవడంతో కొందరు కీలక నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఇంత కష్టపడ్డా సర్వేల పేరుతో తమకు సీటు నిరాకరించారంటూ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పెనుమలూరులో పార్థసారధి తన స్థానాన్ని మంత్రి జోగి రమేశ్ కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ నెల 21న టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కోవలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం ఉన్నారు. అలాగే, కాకినాడకు (Kakinada) చెందిన ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం తన సీటును వంగాగీతకు కేటాయించడంతో అక్కడ బల నిరూపణకు సిద్ధమయ్యారు. ఏలూరుకి సంబంధించి ఎలీజా సైతం పార్టీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో పొమ్మనలేక పొగ పెడుతున్నారని మండిపడ్డారు. అయితే, పార్టీలో నేతలందరికీ సముచిత స్థానం ఉంటుందని, ఎవరూ తొందరపడవద్దని అధిష్టానం, కీలక నేతలు బుజ్జగిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. తమ కష్టానికి ప్రతిఫలం లేదంటూ చాలా మంది తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ క్రమంలో నాలుగో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  


11 మందితో ఫస్ట్ లిస్ట్



  • గుంటూరు పశ్చిమ - విడదల రజని, మంగళగిరి - గంజి చిరంజీవి, ప్రత్తిపాడు - బాలసాని కిషోర్ కుమార్, కొండెపి - ఆదిమూలపు సురేష్

  • వేమూరు - వరికూటి అశోక్ బాబు, తాడికొండ - మేకతోటి సుచరిత, సంతనూతలపాడు - మేరుగు నాగార్జున, చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు

  • అద్దంకి - పాణెం హనిమిరెడ్డి, రేపల్లె - ఈవూరు గణేష్, గాజువాక - వరికూటి రామచంద్రరావు


27 మందితో రెండో జాబితా



  • అనంతపురం ఎంపీ - మాలగుండ్ల శంకరనారాయణ

  • హిందూపురం ఎంపీ - జోలదరాశి శాంత

  • అరకు ఎంపీ (ఎస్టీ) - కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి

  • రాజాం (ఎస్సీ) - డాక్టర్ తాలె రాజేష్

  • అనకాపల్లి - మలసాల భరత్ కుమార్

  • పాయకరావు పేట (ఎస్సీ) - కంబాల జోగులు

  • రామచంద్రాపురం - పిల్లి సూర్యప్రకాష్

  • పి.గన్నవరం (ఎస్సీ) - విప్పర్తి వేణుగోపాల్

  • పిఠాపురం - వంగ గీత

  • జగ్గంపేట - తోట నరసింహం

  • ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు

  • రాజమండ్రి సిటీ - మార్గాని భరత్

  • రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ

  • పోలవరం (ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మి

  • కదిరి - బీఎస్ మక్బూల్ అహ్మద్

  • ఎర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్

  • ఎమ్మిగనూరు - మాచాని వెంకటేష్

  • తిరుపతి - భూమన అభినయ రెడ్డి

  • గుంటూరు ఈస్ట్ - షేక్ నూరి ఫాతిమా

  • మచిలీపట్నం - పేర్ని క్రిష్ణమూర్తి (కిట్టూ)

  • చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

  • పెనుకొండ - కేవీ ఉషశ్రీ చరణ్

  • కళ్యాణదుర్గం - తలారి రంగయ్య

  • అరకు (ఎస్టీ) - గొడ్డేటి మాధవి

  • పాడేరు (ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వర రాజు

  • విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాస రావు

  • విజయవాడ వెస్ట్ - షేక్ ఆసిఫ్ 


21 మందితో మూడో జాబితా


ఎమ్మెల్యే అభ్యర్థులు 



  • ఇచ్ఛాపురం - పిరియా విజయ

  • టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్

  • చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు

  • రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి

  • దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

  • పూతలపట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్

  • చిత్తూరు - విజయానంద రెడ్డి

  • మదనపల్లె - నిస్సార్ అహ్మద్

  • రాజంపేట - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి

  • ఆలూరు - బూసినే విరూపాక్షి

  • కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్

  • గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళి

  • సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి

  • పెనమలూరు - జోగి రమేశ్

  • పెడన - ఉప్పాల రాము


ఎంపీ అభ్యర్థులు వీరే



  • విశాఖపట్నం ఎంపీ - బొత్స ఝాన్సీ

  • విజయవాడ - కేశినేని నాని

  • శ్రీకాకుళం - పేరాడ తిలక్

  • కర్నూల్‌ ఎంపీ - గుమ్మనూరి జయరాం

  • తిరుపతి ఎంపీ - కోనేటి ఆదిమూలం

  • ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్ యాదవ్


అటు, ప్రస్తుతం ఇచ్ఛాపురం జడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జడ్పీ ఛైర్మన్ గా నియమిస్తూ అధిష్టానం ఆదేశాలిచ్చింది.


Also Read: Puttaparthi News: అనంతలో చంద్రబాబు షాడో టీం టూర్‌- పల్లెపై నెగటివ్‌ ఫీడ్‌బ్యాక్- బీసీ అభ్యర్థి కోసం టీడీపీ వెతుకులాట!